
బలగాల టియర్‌గ్యాస్ ప్రయోగంతో రాళ్లు రువి్వన యువత
సోనమ్ వాంగ్‌చుక్ హింసావాదాన్ని కలలో కూడా ఊహించలేదు
పాక్‌తో ఆయనకు సంబంధాలు అంటగట్టడం అత్యంత దారుణం
ఐదేళ్లుగా ఆయన లద్దాఖ్ కోసం గాం«దీమార్గంలో పోరాడుతున్నారు
జాతీయ భద్రతా చట్టం కింద ఆయనపై కేసు పెట్టడం దుర్మార్గం
సోనమ్ అరెస్టుపై ఇప్పటివరకు మాకు సమాచారం కూడా ఇవ్వలేదు
వాంగ్‌చుక్ సతీమణి గీతాంజలి ఆంగ్మో మండిపాటు
లేహ్: కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌కు రాష్ట్రహోదాతోపాటు దానిని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్‌చేస్తూ ఐదేళ్లుగా శాంతియుత పోరాటం చేస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌వాంగ్‌చుక్‌కు పాకిస్తాన్‌తో సంబంధాలు అంటగట్టడం దారుణమని ఆయన సతీమణి గీతాంజలి ఆంగ్మో మండిపడ్డారు. లేహ్‌లో ఈ నెల 24న చోటుచేసుకున్న హింసకు సీఆర్పిఎఫ్ బలగాలే కారణమని ఆరోపించారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యమకారులపైకి సీఆర్పిఎఫ్ బలగాలు భాష్పవాయు గోళాలు ప్రయోగించటంతో ఆగ్రహించిన యువత రాళ్లు రువ్విందని తెలిపారు. సోనమ్ వాంగ్‌చుక్ రెచ్చగొట్టడం వల్లే హింస చెలరేగిందన్న పోలీసుల వాదనను ఆమె తోసిపుచ్చారు. నాటి హింస, తర్వాతి పరిణామాలపై గీతాంజలి ఆంగ్మో ఆదివారం మీడియాతో మాట్లాడారు. వాంగ్‌చుక్ కలలో కూడా హింసాత్మక ఉద్యమాన్ని ఊహించలేదని తెలిపారు. ఈ నెల 24న చెలరేగిన హింసలో నలుగురు మరణించగా, 90 మంది గాయపడ్డారు.
ఈ ఘటనకు వాంగ్‌చుక్ రెచ్చగొట్టే ప్రసంగమే కారణమని లద్దాఖ్ డీజీపీ ఎస్‌డీ సింగ్ జమ్‌వాల్ ఆరోపించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్రప్రభుత్వం.. వాంగ్‌చుక్‌ను అత్యంత కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద అరెస్టు చేసి రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ జైలుకు పంపింది. వారి స్వచ్ఛంద సంస్థ హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ లెరి్నంగ్ (హెచ్‌ఐఏఎల్) లైసెన్స్‌ను కూడా రద్దుచేసింది. ఎన్‌ఎస్‌ఏ కింద అరెస్టు చేస్తే ఎలాంటి విచారణ లేకుండా 12 నెలలపాటు జైల్లో నిర్బంధించవచ్చు.
నా భర్తతో మాట్లాడనివ్వటం లేదు
వాంగ్‌చుక్‌ను అరెస్టు చేసిన నాటి నుంచి ఆయనతో కనీసం మాట్లాడేందుకు కూడా పోలీసులు తనకు అనుమతి ఇవ్వటం లేదని గీతాంజలి ఆరోపించారు. ‘సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధ ఆదేశాల కాపీని శుక్రవారం నాకు అందజేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇవ్వలేదు. దీనిపై మేము న్యాయపోరాటం చేస్తాం. పాకిస్తాన్‌లో ఇటీవలి మా పర్యటన పూర్తిగా వృత్తిగతమైనది, పర్యావరణ పరమైనది. వాంగ్‌చుక్ విదేశీ పర్యటనలన్నీ అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన యూనివర్సిటీలు, సంస్థలు పంపిన ఆహ్వానాల మేరకే జరిగాయి.
వాతావరణ మార్పులపై పాకిస్తాన్‌లో ఐక్యరాజ్యసమితి విభాగం నిర్వహించిన సమావేశానికి మేం హాజరయ్యాం. ఆ సదస్సును నిర్వహించిన సంస్థలు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్‌మెంట్ (ఐసీఐఎంఓడీ) సంస్థకు సంబంధించినవే. ఈ సంస్థలో హిందూకుష్ పర్వతాలతో ముడిపడి ఉన్న 8 దేశాలైన భారత్, నేపాల్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, భూటాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ సభ్యులుగా ఉన్నాయి. పర్యావరణ మార్పులలో మహిళల పాత్రపై పరిశోధన పత్రం సమఆర్పించేందుకు నేను ఆ సదస్సుకు వెళ్లాను. ఆ సదస్సులో ప్రధాని మోదీని వాంగ్‌చుక్ ఎంతో పొడిగారు.
సోనమ్ వాంగ్‌చుక్‌పై ఎన్‌ఎస్‌ఏను ప్రయోగించటం దారుణం. ఆయన ఎన్నడూ శాంతిభద్రతలకు విఘాగం కలిగించే పని చేయలేదు. ఆయన ఎప్పుడూ గాం«దీమార్గంలోనే ఉద్యమం నడిపారు. 24న హింస చెలరేగటానికి ముందు విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వీడియోలు మా వద్ద ఉన్నాయి. ఆ సమయంలో సీఆర్పిఎఫ్ కాల్పులు జరపటానికి ఎవరు అనుమతి ఇచ్చారు? మీ సొంత ప్రజలపై, యువతపై కాల్పులు ఎందుకు జరిపారు? ఆ రోజు ఆయన ఎవరినీ రెచ్చగొట్టలేదు. మార్పు అనేది ఒక వ్యక్తితోనో, ఒకరి మరణం వల్లనో ప్రారంభమవుతుంది.
బహుషా ప్రాణాలు అరి్పంచే ఆ ఒక్క వ్యక్తిని నేనే కావచ్చు. ఈ ఉద్యమంకోసం సంతోషంగా నా ప్రాణాలఆర్పిస్తాను అని వాంగ్‌చుక్ చెప్పారు. కానీ, ఆయన మాటలను వక్రీకరించారు. అయినా, భారత సైన్యానికి షెల్టర్ల కోసం, చైనా వస్తువుల బహిష్కరణకు ఉద్యమిస్తున్న వ్యక్తిని దేశద్రోహి అని ఎలా అంటారు?’అని గీతాంజలి ప్రశ్నించారు. ఎహెచ్‌ఐఏఎల్ సంస్థ అక్రమంగా విదేశీ విరాళాలు స్వీకరిస్తోందన్న ఆరోపణలను ఆమె ఖండించారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) అనుమతి మేరకే విరాళాలు సేకరిస్తున్నామని స్పష్టం చేశారు.