ఢిల్లీ: రోహింగ్యాల అంశంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. అక్రమంగా దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న వారికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతించాలా అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ఇటీవల కస్టడీలో ఉన్న ఐదుగురు రోహింగ్యాల ఆచూకీ లేదని వారి సమాచారం ఇవ్వాలని పిటిషన్ దాఖలయ్యింది. ఈ నేపథ్యంలో కోర్టు దీనిపై తీవ్రంగా స్పందించింది.
భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాలపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు."మీరు అక్రమంగా దేశంలోకి చొరబడతారు. దాని కోసం ఫెన్సింగ్ ను తెంపుతారు, సొరంగం తవ్వుతారు. ఆ తర్వాత మేము మీ దేశంలోకి వచ్చాము. మీ చట్టాలు మాకు వర్తించాలి అంటారు. ఆ తర్వాత మాకు ఆహారం కావాలి, మాకు నివాసం కావాలి, మా పిల్లలకు చదువు కావాలి అంటారు. మేము ఇలా చట్టాలని సాగదీసుకుంటూ పోవాలా "అని రోహింగ్యాలను ఉద్దేశించి పిటిషనర్ ని ప్రశ్నించారు.
మన దేశంలోనూ పేదవారు ఉన్నారు. వారు ఈ దేశ ప్రజలు వారికి కొన్ని సౌకర్యాలు, ప్రయోజనాలు లభించడం లేదు? మీరు వాటిపైన ఎందుకు దృష్టి పెట్టరు. అని అడిగారు. కస్టడీలోకి తీసుకున్న వ్యక్తిని హెబియస్ కార్పస్ పిటిషన్ ద్వారా ఖచ్చితంగా కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. కస్టడీ న్యాయబద్ధమైనదా కాదా అనే విషయం న్యాయమూర్తి అప్పుడు నిర్ణయిస్తారు అని తెలిపారు. అయితే అక్రమంగా ప్రవేశించిన వారిపై సైతం థర్డ్ డిగ్రీ ప్రయోగించడం నిషేధమన్నారు.
అయితే భారత్ రోహింగ్యాలను శరణార్థులుగా ఇంకా ప్రకటించలేదని వారికి శరణార్థులకుండే చట్టబద్ధత హోదా లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఎవరైనా మన దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తే వారిని ఇక్కడ ఉంచాల్సిన అవసరం మనకు ఉందా అని అని అడిగారు. భారత్ కు ఉత్తర భారతంలో చాలా సున్నితమైన సరిహద్దు ఉందని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.
మయన్మార్ దేశానికి చెందిన రోహింగ్యా ముస్లింలకు పౌరసత్వం ఇవ్వడానికి అక్కడి ప్రభుత్వం నిరాకరించింది. దీంతో వారు ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లారు.అయితే భారత్ వీరిని శరణార్థులుగా గుర్తించలేదు. అయినప్పటికీ దేశంలో అక్రమంగా చొరబడి నివసిస్తున్నారు. ఇండియాలో దాదాపు 40 వేలకు పైగా రోహింగ్యాలు ఉన్నట్లు సమాచారం.


