ముంబై హిట్‌ అండ్‌ రన్‌ కేసు.. అతడికి బెయిల్‌ మంజూరు | Shiv Sena Rajesh Shah Received Provisional Bail In it And Run Case | Sakshi
Sakshi News home page

ముంబై హిట్‌ అండ్‌ రన్‌ కేసు.. అతడికి బెయిల్‌ మంజూరు

Jul 8 2024 6:13 PM | Updated on Jul 8 2024 6:48 PM

Shiv Sena Rajesh Shah Received Provisional Bail In it And Run Case

ముంబై: మహారాష్ట్రలో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితుడు మిషిర్‌ షా తండ్రి, శివసేన నేత రాజేష్‌ షాకు బెయిల్‌ లభించింది. సోమవారం సాయంత్రం రాజేష్‌ షాకు కోర్టు బెయిల్‌ రూ.15వేల పూచీకత్తుతో ప్రొవిజినల్‌ బెయిల్‌ను మంజూరు చేసింది.

ఇక, ఈరోజు ఉదయం హిట్‌ రన్‌ కేసులో భాగంగా పోలీసులు రాజేష్‌, కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో సిటీ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం రాజేష్‌కు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఇక, తాజాగా కోర్టు రాజేష్‌ షాకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా.. కారుతో ఢీకొట్టి మహిళ మరణానికి కారణమైన మిషిర్‌ షాకు లుక్‌ అవుట్‌ నోటీస్‌ను పోలీసులు జారీ చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీస్ బృందాలు వెతుకుతున్నాయి.

మరోవైపు.. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు అంతా సమానమేనని షిండే తెలిపారు. ఈ ఘటనలో ఉన్నది ఎంత పెద్ద ధనవంతుడైనా, రాజకీయ నాయకుడైన ఎవరినీ వదిలి పెట్టేది లేదన్నారు. ఇక, షిండే ఇలా వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే రాజేష్‌ షాకు బెయిల్‌ రావడం మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: ముంబై హిట్‌ అండ్‌ రన్‌ ఘటనపై సీఎం షిండే సంచలన కామెంట్స్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement