ప్రధాని మోదీతో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ భేటీ

Sharad Pawar Meets PM Narendra Modi New Delhi - Sakshi

న్యూఢిల్లీ: ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో దాదాపు 20 నిమిషాలపాటు ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ జరిగిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్సీపీ, శివసేన నేతలపై ఈడీ, సీబీఐ చర్యలపైనే ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. మహారాష్ట్ర మజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను ఉదయం సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. సేన ఎంపీ సంజయ్‌ రౌత్ ఆస్తులను నిన్న ఈడీ అటాచ్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రధానితో పవార్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

చదవండి: (ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన భారత వైద్యవిద్యార్థులకు తీపి కబురు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top