
కేంద్రానికి సుప్రీం మూడు వారాల గడువు
న్యూఢిల్లీ: పాలియేటివ్ కేర్‌పై 2017లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గదర్శకాల అమలుపై వివరాలు తెలియజేయాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు మూడు వారాల గడువు ఇచి్చంది. కేసు తదుపరి విచారణను నవంబర్ 25కు వాయిదా వేసింది. టర్మీనల్ ఇల్‌నెస్ (వ్యాధి)తో బాధపడుతున్న రోగులకు జాతీయ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా పాలియేటివ్ కేర్ విధానాన్ని వర్తింపజేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా బెంచ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేంద్రానికి ఈ ఆదేశాలను జారీ చేసింది. కేంద్రం మాత్రమే కాకుండా రాష్ట్రాల నుండి కూడా సమగ్ర సమాచారం సేకరించి తెలియజేయాలని కేంద్రం తరఫు హాజరైన అదనపు సాలిసిటర్ జనరల్, సీనియర్ న్యాయవాదిని ధర్మాసనం ఆదేశాలిచి్చంది.
పాలియేటివ్ కేర్: తీవ్రమైన లేదా చివరి దశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అందించే ప్రత్యేక వైద్య సంరక్షణ విధానం.
టర్మీనల్ ఇల్‌నెస్ రోగి: నయంకాని వ్యాధి లేదా వైద్య పరిస్థితితో బాధపడుతూ, చివరికి మరణానికి దారితీసే అవకాశం ఉన్న వ్యక్తి.