కొత్త సీఎస్‌గా శారదా మురళీధరన్
తిరువనంతపురం: దక్షిణ భారతదేశంలో నెల వ్యవధిలోనే అరుదైన రికార్డు పునరావృతమైంది. కేరళ నూతన ప్రధాన కార్యదర్శిగా శారదా మురళీధరన్ బుధవారం నియమితులయ్యారు. ఆమె తన భర్త, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి వి.వేణు నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. వేణు ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్నారు.
ప్రణాళిక విభాగంలో అడిషనల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న 1990 బ్యాచ్ ఐఏఎస్ శారదను తదుపరి సీఎస్‌గా ఎంపిక చేస్తూ కేరళ కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. కర్నాటకలోనూ ఆగస్టు 1న శాలినీ రజనీష్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. భర్త రజనీష్ గోయెల్ రిటైరయ్యాక ఆయన స్థానంలో శాలినీ సీఎస్ అయ్యారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
