పట్టాలు తప్పిన సబర్మతి రైలు | Sabarmathi-Agra Superfast Rail Derailed In Rajasthan | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన సబర్మతి రైలు.. పలువురికి గాయాలు

Mar 18 2024 8:32 AM | Updated on Mar 18 2024 9:45 AM

Sabarmathi Superfast Rail Derailed In Rajastan - Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో సబర్మతి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. గూడ్స్‌ రైలును ఢీకొట్టిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. అజ్మీర్‌లోని మడర్‌ రైల్వేస్టేషన్‌లో సోమవారం తెల్లవారుజామున ఒంటి గంటకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సబర్మతి రైలులోని పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

సబర్మతి సూపర్‌ఫాస్ట్‌ డ్రైవర్‌ అత్యవసర బ్రేకులు వేసి రైలును ఆపడానికి ప్రయత్నించినప్పటికీ అది గూడ్స్‌ రైలును ఢీ కొట్టింది. ఈ ఘటనపై నార్త్‌ వెస్టర్న్‌ రైల్వే ఎక్స్‌(ట్విటర్‌)లో ఒక పోస్టు చేసింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది.  ప్రమాదానికి సంబంధించి వివరాల కోసం హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. 

ఇదీ చదవండి.. కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

Advertisement
 
Advertisement
Advertisement