Road Accidents: రూ. లక్షా యాభై వేల వరకూ క్యాష్ లెస్ ట్రీట్ మెంట్‌ | Rs 1.5 Lakh Cashless Treatment Scheme For Road Accident Victims Nationwide: Centre Government | Sakshi
Sakshi News home page

Road Accidents: రూ. లక్షా యాభై వేల వరకూ క్యాష్ లెస్ ట్రీట్ మెంట్‌

May 6 2025 5:40 PM | Updated on May 6 2025 6:02 PM

Rs 1 5 lakh of cashless treatment announced for road accidents

ఢిల్లీ: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఉచిత వైద్యం అందించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  భారత్‌ లో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి లక్షా యాభై వరకూ ఉచిత వైద్యం అందిండానికి వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.  ఆస్పత్రుల్లో లక్షా యాభై వేల వరకూ క్యాష్‌ లెస్‌ ట్రీట్‌మెంట్‌ అందించాలని నిర్ణయించింది. 

ఇది నిన్నటి(సోమవారం) రాత్రి నుంచే అమల్లోకి వచ్చినట్లు కేంద్రం రహదారుల రవాణాశాఖ స్పష్టం చేసింది.‘క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ రోడ్‌ యాక్సిడెంట్‌ విక్టిమ్స్‌ స్కీం-2025’గా దీనికి నామకరణం చేశారు.  రోడ్డు ప్రమాదాలు జగిగిన సందర్భాల్లో గోల్డెన్‌ అవర్‌ ఉచిత వైద్యం అందించాలనే సుప్రీం తీర్పును గతంలో వెలువరించడంతో దానికికనుగణంగా కేంద్రం చర్యలు చేపట్టింది. వాహనాల కారణంగా రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి ఈ పథకం వర్తించనుంది. అదే సమయంలో ప్రమాదం జరిగిన నాటి నుంచి ఏడురోజుల వరకూ ఈ సదుపాయం పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement