breaking news
cash less scheme
-
Road Accidents: రూ. లక్షా యాభై వేల వరకూ క్యాష్ లెస్ ట్రీట్ మెంట్
ఢిల్లీ: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఉచిత వైద్యం అందించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి లక్షా యాభై వరకూ ఉచిత వైద్యం అందిండానికి వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆస్పత్రుల్లో లక్షా యాభై వేల వరకూ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందించాలని నిర్ణయించింది. ఇది నిన్నటి(సోమవారం) రాత్రి నుంచే అమల్లోకి వచ్చినట్లు కేంద్రం రహదారుల రవాణాశాఖ స్పష్టం చేసింది.‘క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం-2025’గా దీనికి నామకరణం చేశారు. రోడ్డు ప్రమాదాలు జగిగిన సందర్భాల్లో గోల్డెన్ అవర్ ఉచిత వైద్యం అందించాలనే సుప్రీం తీర్పును గతంలో వెలువరించడంతో దానికికనుగణంగా కేంద్రం చర్యలు చేపట్టింది. వాహనాల కారణంగా రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి ఈ పథకం వర్తించనుంది. అదే సమయంలో ప్రమాదం జరిగిన నాటి నుంచి ఏడురోజుల వరకూ ఈ సదుపాయం పొందవచ్చు. -
నగదు రహిత లావాదేవీలపై అవగాహన ర్యాలీ
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఎస్కేయూ విద్యా విభాగం, కళాశాల జాతీయ సేవా విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు నగరంలో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ కో ఆర్డీనేటర్ రమణ, ప్రోగ్రాం ఆఫీసర్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ తమ ప్రాంతాల్లోని ప్రజలకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు. దత్తత తీసుకున్న గ్రామాల్లో ఇంటింటి సర్వేను నిర్వహించాలన్నారు. బ్యాంకు అకౌంట్, డెబిట్ కార్డులు, రూపే కార్డుల వినియోగంపై వారికి వివరించాలన్నారు. ఎన్ఎస్ఎస్ విభాగం ప్రోగ్రాం ఆఫీసర్ వరలక్ష్మీ, ధనుంజయ, ఆంజినేయులు తదితరులు పాల్గొన్నారు.