breaking news
Ministry of Road Transport
-
Road Accidents: రూ. లక్షా యాభై వేల వరకూ క్యాష్ లెస్ ట్రీట్ మెంట్
ఢిల్లీ: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఉచిత వైద్యం అందించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి లక్షా యాభై వరకూ ఉచిత వైద్యం అందిండానికి వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆస్పత్రుల్లో లక్షా యాభై వేల వరకూ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందించాలని నిర్ణయించింది. ఇది నిన్నటి(సోమవారం) రాత్రి నుంచే అమల్లోకి వచ్చినట్లు కేంద్రం రహదారుల రవాణాశాఖ స్పష్టం చేసింది.‘క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం-2025’గా దీనికి నామకరణం చేశారు. రోడ్డు ప్రమాదాలు జగిగిన సందర్భాల్లో గోల్డెన్ అవర్ ఉచిత వైద్యం అందించాలనే సుప్రీం తీర్పును గతంలో వెలువరించడంతో దానికికనుగణంగా కేంద్రం చర్యలు చేపట్టింది. వాహనాల కారణంగా రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి ఈ పథకం వర్తించనుంది. అదే సమయంలో ప్రమాదం జరిగిన నాటి నుంచి ఏడురోజుల వరకూ ఈ సదుపాయం పొందవచ్చు. -
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు పలు రంగాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న అభివృద్ధికి అనుగుణంగా రోడ్లు భవనాల శాఖలో పని విస్తృతి పెరుగుతున్నదని, అందుకు అనుగుణంగా శాఖలోని పలు విభాగాలను పటిష్టం చేయాలని, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీసుకున్న పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రోడ్లు భవనాల శాఖలో అధికార వికేంద్రీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన అదనపు ఉద్యోగ నియామకాలను చేపట్టాలని, అవసరమైన మేరకు నూతన కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆదేశించింది. అందుకోసం అదనపు నిధులను కూడా మంజూరు చేసింది. ఇందులో భాగంగా రోడ్లు భవనాల శాఖ చేసిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతే కాకుండా అత్యవసర సమయాల్లో అధికారులు స్వీయ నిర్ణయంతో ప్రజావసరాలకు అనుగుణంగా పనులు చేపట్టేందుకు కేబినెట్ అవకాశమిచ్చింది. పోలీస్‌శాఖలో నియామకాలు రాష్ట్ర పోలీసు శాఖలో నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని మొత్తం 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది. వీటితోపాటు.. మూడు కమిషనరేట్ల పరిధిలో.. శాంతిభద్రతలను మరింతగా మెరుగు పరిచేందుకు నూతన పోలీస్ స్టేషన్లు, నూతన సర్కిల్లు, నూతన డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గురుకులాల్లో పోస్టుల భర్తీ తెలంగాణ మంత్రివర్గం మహాత్మా జ్యోతి బాఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ గురుకులాల్లోని పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. మొత్తం 2,591 నూతన ఉద్యోగాల నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రారంభించిన 4 జూనియర్ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలు, 33 రెసిడెన్షియల్ పాఠశాలలల్లో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ విభాగాల్లో, అవసరమైన మేరకు ఈ నూతన నియామకాలను చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది. వరాలు... రోడ్లు భవనాల శాఖలో పెరిగిన పనికి అనుగుణంగా శాఖను పునర్ వ్యవస్థీకరించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బి శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది. ఇందులో.. కొత్తగా 3 చీఫ్ ఇంజనీర్ పోస్టులు, 12 సూపరిండెంట్ ఇంజనీర్ పోస్టులు, 13 ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, 102 డి.ఈ.ఈ పోస్టులు, 163 అసిస్టెంట్ ఈ.ఈ పోస్టులు, 28 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులతో పాటు పలు టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది పోస్టులున్నాయి. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టాలని రోడ్లు భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది. దాంతో పాటు సత్వరమే పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. చదవండి: పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం పెరిగిన నూతన ఉద్యోగాలతో పాటు, ఆర్ అండ్ బీ శాఖలో పరిపాలన బాధ్యతల వికేంద్రీకరణకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల నిర్మాణం, మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బి శాఖ లోని.., రోడ్లు, భవనాలు, ఎలక్ట్రికల్, జాతీయ రహదారుల విభాగాల్లో... 3 చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలను., 10 సర్కిల్ కార్యాలయాలను., 13 డివిజన్ కార్యాలయాలను., 79 సబ్ డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి శాఖను కేబినెట్ ఆదేశించింది. రోడ్లు భవనాల శాఖను మరింత పటిష్ట పరిచేందుకు ప్రజావసరాల దృష్ట్యా పనులు చేపట్టేందుకు ఈ ఆర్థిక సంవత్సరానికి అదనంగా నిధులను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించింది. ఇందులో భాగంగా.. కాలానుగుణంగా చేపట్టే రోడ్ల మరమ్మతుల (పీరియాడిక్ రెన్యువల్స్) కోసం, కూ. 1865 కోట్లను మంజూరు చేసింది. వానలు, వరదలు తదితర ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా రోడ్లు తెగిపోవడం, కొట్టుకుపోవడం వంటి సందర్భాల్లో ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగు పరిచే దిశగా తక్షణమే పనులు చేపట్టేందుకు గాను.. రూ. 635 కోట్ల నిధులను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. వానలు వరదలు తదితర ప్రకృతి విపత్తుల సందర్భంలో, ప్రజావసరాలకు అనుగుణంగా, అసౌకర్యాన్ని తొలగించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు.. వీలుగా కింది స్థాయి డీఈఈ నుంచిపై స్థాయి సీఈ వరకు స్వతంత్ర నిర్ణయాధికారానికి కేబినెట్ ఆమోదించింది. ఇందులో భాగంగా.. విచక్షణతో కూడిన స్వీయ నిర్ణయాలను తీసుకుని పనులు చేపట్టేందుకు డిఈఈకి ఒక పనికి రూ. 2లక్షలు (సంవత్సరానికి 25 లక్షలు), ఈఈకి 25 లక్షల వరకు(ఏడాదికి 1.5 కోట్లు), ఎస్ఈ పరిధిలో 50 లక్షలు (సంవత్సరానికి 2 కోట్లు), సీఈ పరిధిలో రూ.1 కోటి వరకు(సంవత్సరానికి 3 కోట్ల వరకు) పనులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అత్యవసర సమయాల్లో ఈ పనులను అవసరమైతే నామినేషన్ పద్దతుల్లో చేపట్టేందుకు అధికారాలను కల్పించింది. ఇందు కోసం ఏడాదికి రూ.129 కోట్లు ఆర్అండ్బీ శాఖ ఖర్చు చేసేందుకు కేబినెట్ అవకాశం కల్పించింది. ఇదే పద్దతిని అనుసరిస్తూ.. భవనాల విభాగంలో కూడా అత్యవసర సమయాల్లో రిపేర్లు తదితర ప్రజావసరాల కోసం ఖర్చు చేసేందుకు అవకాశం కల్పించింది. అత్యవసర పనులు చేపట్టేందుకు పరిమిత నిధులతో స్వీయ నిర్ణయాధికారాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు తగ్గట్టుగా నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. -
గడ్కరీని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలిశారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధితో పాటు వివిధ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్రమంత్రికి కోమటిరెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకు జాతీయ రహదారి అభివృద్ధి పనులకు రూ.600 కోట్లు మంజూరు చేసినందుకు గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్‌హెచ్– 365పై నకిరేకల్ నుంచి తానం చెర్ల వరకు నూతనంగా రోడ్డు విస్తరణ పనులు మంజూరు అయినందు న, అందులోనే అర్వపల్లి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. మిర్యాలగూడ పట్టణం విస్తరిస్తున్నందున మున్సిపాలిటీ పరిధిలో జాతీ య రహదారి 167పై అలీనగర్ నుంచి మిర్యాలగూడ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. గౌరెల్లి సమీపంలోని ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి వలిగొండ–తొర్రూర్–నెల్లికుదురు–మహబూబాబాద్–ఇల్లందు మీదుగా కొత్తగూడెం జాతీయ రహదారి–30 వరకు నూతనంగా మంజూరైన ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని గడ్కరీకి వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. పీఆర్సీ కోసం ఎన్నిసార్లు కమిటీలు వేస్తారు సాక్షి, హైదరాబాద్: పీఆర్సీ కోసం ఎన్నిసార్లు కమిటీ వేస్తారని సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికలలోపే నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు వేతనాలు, వయో పరిమితి పెంపు, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గడ్కరీకి వినతిపత్రం అందజేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
వాహనాల దూకుడుకు కళ్లెం!
సాక్షి, హైదరాబాద్: రహదారులపై వేగానికి కళ్లెం వేసేందుకు రవాణాశాఖ సిద్ధమైంది. అతి వేగం నియంత్రణకు టోల్గేట్లను వినియోగించుకునేందుకు సమాయత్తమవుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం బస్సు ప్రమాదం నేపథ్యంలో వాహనాల వేగాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. టోల్గేట్ల మధ్య దూరాన్ని బట్టి వాహనాల వేగా న్ని లెక్కించాలని రవాణా శాఖ నిర్ణయించింది. అనుమతించిన దానికంటే ఎక్కువ వేగంగా ప్రయాణించినట్లు నిర్ధ్దారణ అయితే చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఒక టోల్గేట్ నుంచి మరో టోల్గేట్ చేరడానికి ఎంత సమయం పడుతుందనే విషయాన్ని లెక్కగట్టి అంత కంటే ముందుగా చేరితే అతి వేగంతో ప్రయాణించినట్లు గుర్తిస్తారు. ఆ వాహనదారులపై చర్యలు తీసుకుంటారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి.