గడ్కరీని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి

MP Komatireddy Met Central Minister Nitin Gadkari - Sakshi

వివిధ రహదారుల అభివృద్ధిపై వినతిపత్రం  

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలిశారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధితో పాటు వివిధ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్రమంత్రికి కోమటిరెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఎల్‌బీ నగర్‌ నుంచి మల్కాపూర్‌ వరకు జాతీయ రహదారి అభివృద్ధి పనులకు రూ.600 కోట్లు మంజూరు చేసినందుకు గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్‌హెచ్‌– 365పై నకిరేకల్‌ నుంచి తానం చెర్ల వరకు నూతనంగా రోడ్డు విస్తరణ పనులు మంజూరు అయినందు న, అందులోనే అర్వపల్లి వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. మిర్యాలగూడ పట్టణం విస్తరిస్తున్నందున మున్సిపాలిటీ పరిధిలో జాతీ య రహదారి 167పై అలీనగర్‌ నుంచి మిర్యాలగూడ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. 

గౌరెల్లి సమీపంలోని ఔటర్‌ రింగ్‌రోడ్డు నుంచి వలిగొండ–తొర్రూర్‌–నెల్లికుదురు–మహబూబాబాద్‌–ఇల్లందు మీదుగా కొత్తగూడెం జాతీయ రహదారి–30 వరకు నూతనంగా మంజూరైన ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని గడ్కరీకి వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు.

పీఆర్సీ కోసం ఎన్నిసార్లు కమిటీలు వేస్తారు
సాక్షి, హైదరాబాద్‌: పీఆర్సీ కోసం ఎన్నిసార్లు కమిటీ వేస్తారని సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికలలోపే నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు వేతనాలు, వయో పరిమితి పెంపు, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 

గడ్కరీకి వినతిపత్రం అందజేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top