వేదికపై చోటు దక్కని ఆర్‌ఎల్‌డీ | Row over Jayant Chaudhary's seat at NDA meet | Sakshi
Sakshi News home page

వేదికపై చోటు దక్కని ఆర్‌ఎల్‌డీ

Jun 8 2024 4:43 AM | Updated on Jun 8 2024 4:43 AM

Row over Jayant Chaudhary's seat at NDA meet

న్యూఢిల్లీ: పాత పార్లమెంట్‌(సంవిధాన్‌ సదన్‌)లో శుక్రవారం ఎన్‌డీఏ భేటీ సందర్భంగా రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్‌డీ) చీఫ్‌ జయంత్‌ చౌదరిని వేదికపైకి ఆహా్వనించకుండా ఎంపీల మధ్య కూర్చోబెట్టి బీజేపీ అవమానించిందంటూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టలు ఆరోపించాయి. 

‘‘ ఒక్క సీటు సాధించిన పారీ్టలకూ వేదికపై బీజేపీ చోటిచి్చంది. ఇద్దరు ఎంపీలున్న ఆర్‌ఎల్‌డీని పట్టించుకోలేదు. ఆత్మాభిమానముంటే వెంటనే ఎన్‌డీఏను వీడండి. మిమ్మల్ని అవమానిస్తే సహించకండి’ అని జయంత్‌కు ఎస్పీ ఎంపీ రాజీవ్‌ రాయ్‌ హితవు పలికారు. కుర్చీలను బట్టి గౌరవం మారదని, అదేమంత పెద్ద విషయం కాదని ఆర్‌ఎల్‌డీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ బదులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement