ఆర్‌ఎల్‌డీ చీఫ్‌గా జయంత్‌ చౌదరి | Jayant Chaudhary elected the national president of Rashtriya Lok Dal | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎల్‌డీ చీఫ్‌గా జయంత్‌ చౌదరి

Nov 17 2025 6:29 AM | Updated on Nov 17 2025 6:28 AM

Jayant Chaudhary elected the national president of Rashtriya Lok Dal

లక్నో: రాష్ట్రీయ లోక్‌దళ్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి జయంత్‌ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఆదివారం ఆ పార్టీ జాతీయ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. అనంతరం జయంత్‌ చౌదరి ఎక్స్‌లో..ఎన్డీయే ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందన్నారు. మాజీ ప్రధాని, తన తాత స్వర్గీయ చౌదరి చరణ్‌ సింగ్‌ ఆశయ సాధనకు పాటుపడాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. 

దేశవ్యాప్తంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 1.25 కోట్ల మొక్కలను నాటుతామన్నారు. ‘వాళ్లకు నేతలు లేరు విధానాలు లేవు. అందుకే విఫలమవుతున్నాయి’అంటూ ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. అధికార ఎన్డీయే భాగస్వామ్య పక్షాల్లో ఆర్‌ఎల్‌డీ కూడా ఉంది. ఈ పార్టీకి లోక్‌సభలో ఇద్దరు, రాజ్యసభలో ఒక సభ్యుడు ఉన్నారు. యూపీ అసెంబ్లీలో ఆర్‌ఎల్‌డీకి 9 మంది సభ్యుల బలముంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement