ఆ రాష్ట్రంలోనూ ‘లివ్‌ ఇన్‌’కు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి | Rajasthan High Court Directs Government to Start Portal for live in Relationship Registration | Sakshi
Sakshi News home page

ఆ రాష్ట్రంలోనూ ‘లివ్‌ ఇన్‌’కు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

Jan 30 2025 11:09 AM | Updated on Jan 30 2025 11:18 AM

Rajasthan High Court Directs Government to Start Portal for live in Relationship Registration

జైపూర్‌: ‘లివ్‌ ఇన్‌ రిలేషన్‌’ జంటల విషయంలో రాజస్థాన్‌ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తరహా జంటలు తమ సంబంధాన్ని అధికారికంగా నమోదు చేసుకునేందుకు ఒక పోర్టల్‌ను ప్రారంభించాలని రాజస్థాన్ హైకోర్టు సింగిల్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హైకోర్టులో ‘లివ్‌ ఇన్‌’ జంటలు దాఖలు చేసిన పిటిషన్‌లో వారు తమకు భద్రత కల్పించాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు సింగిల్ బెంచ్ .. ‘కొందరు యువతీ యువకులు ‘లివ్-ఇన్’ సంబంధంలో ఉంటున్నారు. వారి సంబంధాన్ని పెద్దలు, ఇతరులు అంగీకరించకపోవడం వల్ల, ఆ జంటలతో పాటు వారి కుటుంబాలు సమాజంలో హేళనను, ముప్పును ఎదుర్కొంటున్నాయి. అందుకే వారు తమ జీవితాలను, స్వేచ్ఛను కాపాడాలని కోరుతున్నారు.

దీనిపై చట్టం రూపొందించే వరకు ‘లివ్-ఇన్’ సంబంధాలను అధికారం కలిగిన ట్రిబ్యునల్ వద్ద నమోదు చేయాలని జస్టిస్ అనూప్ కుమార్ ధండ్ పేర్కొన్నారు. ‘లివ్-ఇన్’ సంబంధంలో ఉండే స్త్రీ భాగస్వామికి భార్య లాంటిది కాదని హైకోర్టు పేర్కొంది. ఇటువంటి సంబంధంలో జీవించాలనే ఆలోచన కొత్తగా అనిపించవచ్చు. కానీ వాస్తవానికి దీని కారణంగా పలు సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి ‘లివ్‌ ఇన్‌’ సంబంధాల నమోదు విషయాన్ని పరిశీలించడానికి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి, ఈ తరహా జంటల ఫిర్యాదులను పరిశీలించి, వాటిని ఆ కమిటీ పరిష్కరించాలి. ఇందుకోసం ఒక వెబ్‌సైట్ లేదా వెబ్ పోర్టల్ ఉండాలి" అని హైకోర్టు సింగిల్ బెంచ్ పేర్కొంది. కాగా ఉత్తరాఖండ్‌లో ‘లివ్‌ ఇన్‌’లో ఉంటున్న జంటలకు రాష్ట్రప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేసింది.

ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట అనంతరం భద్రత పెంపు

Advertisement
 
Advertisement
Advertisement