మహారాష్ట్ర ఎన్నికల్లో ఓట్ల చోరీ: రాహుల్‌ | Rahul Gandhi Alleges Vote Theft In Maharashtra Assembly Polls | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర ఎన్నికల్లో ఓట్ల చోరీ: రాహుల్‌

Jun 25 2025 2:52 AM | Updated on Jun 25 2025 2:52 AM

Rahul Gandhi Alleges Vote Theft In Maharashtra Assembly Polls

న్యూఢిల్లీ: గతేడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ చోటుచేసుకుందని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. వెంటనే డిజిటల్‌ ఓటరు జాబితాను, సీసీటీవీ ఫుటేజీని బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. 2024లో లోక్‌సభ ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఆరు నెలల వ్యవధి మాత్రమే ఉందని ఆయన మంగళవారం ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఇంత తక్కువ సమయంలోనే బీజేపీ నేత, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ పోటీ చేసిన నాగపూర్‌(నైరుతి) అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్తగా 29,219 ఓట్లు నమోద య్యాయని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు ఓట్లేసినట్లు బూత్‌ స్థాయి అధికారు లు నివేదించారని కూడా ఆయన చెప్పారు. ఈ వ్యవహారంపై మీడియాతో పాటు ఈసీ కూడా నిశ్శబ్దంగా ఉందన్నారు. అందుకే, వెంటనే డిజిటల్‌ ఓటరు జాబితాను, సీసీటీవీ ఫుటేజీని విడుదల చేయాలని ఈసీని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement