
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఏదో ఒక విషయమై తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. మరోవైపు సీఎం నిరాడంబరతను చాలామంది మెచ్చుకుంటుంటారు. ప్రస్తుతం ఆయన నైనిటాల్‌లో బస చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఒక పని ప్రజల దృష్టిని ఆకర్షించింది.
ధామీ క్రమంతప్పక మార్నింగ్‌వాక్ చేస్తుంటారు. తాజాగా ఆయన మార్నింగ్ వాక్ సమయంలో రోడ్డు పక్కగా ఉన్న ఒక టీ దుకాణాన్ని గమనించారు. తరువాత అక్కడికి వెళ్లి, స్వయంగా అల్లాన్ని తరిగి టీ పెట్టారు. దీనిని గమనించిన అక్కడున్న వారంతా సీఎం చుట్టూ చేరారు. సీఎం వారిని కుశలప్రశ్నలు వేశారు. ఇంతటి సింప్లిసిటీ కలిగిన సీఎం దొరకడం తమకు లభించిన వరమని అంటూ అక్కడున్నవారంతా మురిసిపోయారు. అనంతరం సీఎం ఆ పక్కనే మైదానంలో ఆడుకుంటున్న క్రీడాకారులను పలుకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు.