ప్రేమలో గొడవ.. ప్రేయసిపై ఘాతుకం | Punjab Mohali Dimple Shocking Case Details | Sakshi
Sakshi News home page

ప్రేమలో గొడవ.. ప్రేయసిపై ఘాతుకం

Jun 5 2026 11:01 AM | Updated on Jun 5 2026 11:15 AM

Punjab Mohali Dimple Shocking Case Details

ప్రేమ సంబంధం.. బెడిసి కొట్టి రక్తసిక్తమైంది. ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. ఆఫీస్‌లో.. అదీ తోటి ఉద్యోగులు చూస్తుండగానే ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. ఆపై తన గొంతు కోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించాడు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఘోరం వివరాల్లోకి వెళ్తే.. 

పంజాబ్‌లోని మొహాలీ నగరంలో గురువారం సాయంత్రం ఘోరం జరిగింది. ఓ ప్రైవేట్ కంపెనీ కార్యాలయంలో సహోద్యోగి చేతితో యువతి దారుణ హత్యకు గురైంది. అక్కడే ఉన్న కొందరు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆ ఉన్మాది ఆగలేదు. అనంతరం నిందితుడు తన గొంతును తానే పలుమార్లు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డింపుల్‌ ఓ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. అక్కడే పని చేసే హర్విందర్ మాన్ అలియాస్ హ్యారీతో మూడేళ్లుగా రిలేషస్‌షిప్‌లో ఉంది. అయితే.. కొన్నిరోజులుగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. హ్యారీ డింపుల్‌ను బతిమాలుతూ వచ్చాడు. ఈ క్రమంలో బ్రేకప్‌ను వెనక్కి తీసుకునేందుకు డింపుల్‌ అంగీకరించలేదు. పైగా హెచ్‌ఆర్‌కు ఫిర్యాదు చేయడంతో అతనికి నోటీసులు ఇచ్చారు. 

దీంతో.. గురువారం సాయంత్రం సుమారు 7:40 గంటల సమయంలో నిందితుడు ఆఫీస్‌లోకి వచ్చాడు. అప్పటికే తన డెస్క్ వద్ద పని చేస్తున్న డింపుల్‌పై వెనుక నుంచి దాడి చేసి కత్తితో పొడిచాడు. ఆమె ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీసినా.. నిందితుడు వెంటాడుతూ జుట్టు పట్టుకుని లాగుతూ మరింతగా దాడి చేశాడు.

కార్యాలయంలో ఉన్న సిబ్బంది అతడిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు. ఈ దాడిలో డింపుల్‌కు 20 కత్తిపోట్లు పడ్డట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆ తర్వాత నిందితుడు అదే కార్యాలయంలోకి వెళ్లి తన గొంతును తానే పలుమార్లు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

తీవ్ర భయాందోళనకు గురైన ఉద్యోగులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఇద్దరినీ సమీపంలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే డింపుల్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడి ఒంటిపై 30 కత్తి పోట్లు ఉన్నాయని.. ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. డింపుల్‌ కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement