సైప్రస్‌ చేరుకున్న ప్రధాని మోదీ | Prime Minister Modi arrives in Cyprus | Sakshi
Sakshi News home page

సైప్రస్‌ చేరుకున్న ప్రధాని మోదీ

Jun 16 2025 5:00 AM | Updated on Jun 16 2025 5:00 AM

Prime Minister Modi arrives in Cyprus

మోదీకి స్వాగతం పలుకుతున్న సైప్రస్‌ అధ్యక్షుడు క్రిస్టోడౌలిడ్స్‌

నికోసియా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం ఆదివారం సైప్రస్‌ చేరుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడౌలిడ్స్‌తో ఆయన చర్చలు జరుపుతారు. లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి అధ్యక్షుడు క్రిస్టోడౌలిడ్స్‌ స్వయంగా స్వాగతం పలికారు. భారత ప్రధాని ఒకరు సైప్రస్‌లో పర్యటించడం రెండు దశాబ్దాల కాలంలో ఇదే ప్రథమం.

సైప్రస్‌ అధ్యక్షుడితో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల వంటి రంగాల్లో బంధాన్ని దృఢతరం చేసుకునేందుకు అవకాశముందని ప్రధాని మోదీ ‘ఎక్స్‌’లో తెలిపారు. ప్రధాని మోదీ తమ దేశానికి రావడం చారిత్రక సందర్భమని క్రిస్టోడౌలిడ్స్‌ తెలిపారు. స్థానిక హోటల్‌లో ప్రధాని మోదీ బస చేశారు. ఈ సందర్భంగా ‘వందే మాతరం, భారత్‌ మాతా జీ జై’ అంటూ భారత సంతతి ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. సైప్రస్‌ పర్యటన అనంతరం కెనడాలో జరిగే జీ7 శిఖరాగ్రానికి ప్రధాని మోదీ వెళ్లనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement