మహాత్మునికి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ | PM Modi Oath Ceremony NDA Government Formation | Sakshi
Sakshi News home page

Narendra Modi Oath-Taking Ceremony: మహాత్మునికి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

Jun 9 2024 7:53 AM | Updated on Jun 9 2024 8:53 AM

PM Modi Oath Ceremony NDA Government Formation

దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ మూడోసారి దేశానికి ప్రధాని కాబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన ఈరోజు ఉదయాన్నే రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. అక్కడ జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద పూలమాలలు  ఉంచి, నివాళులర్పించారు.

మోదీ ప్రమాణాస్వీకారోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పలు చోట్ల దీనికి సంబంధించిన పోస్టర్లు అతికించారు. ఈ కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే లను ఆహ్వానించారు. 
 

 ఇదీ చదవండి: నేడు మోదీ మూడోసారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement