President Election 2022: ద్రౌపది ముర్ముకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు | PM Modi Congratulates Draupadi Murmu After Winning President Poll | Sakshi
Sakshi News home page

Draupadi Murmu-PM Modi ద్రౌపది ముర్ము ఇంటికి వెళ్లిన మోదీ.. పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు

Jul 21 2022 8:34 PM | Updated on Jul 21 2022 8:48 PM

PM Modi Congratulates Draupadi Murmu After Winning President Poll - Sakshi

ముర్ముకు శుభాకాంక్షలు చెబుతున్న మోదీ

15వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్న ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.  స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు.

సాక్షి,న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అభినందనలు వెల్లువెత్తున్నాయి. 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్న ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.  స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మోదీతోపాటు ముర్ము నివాసానికి వెళ్లారు. కాసేపు ఆమెతో ముచ్చటించారు.

మోదీ, నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఇతర పార్టీల రాజకీయ నేతలు, ప్రముఖులు కూడా ముర్ముకు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ద్రౌపది ముర్ము చేతిలో ఓడిపోయిన యశ్వంత్‌ సిన్హా కూడా ఆమెకు అభినందనలు తెలియజేశారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచి ఆ బాధ్యతలు చేపడుతున్న తొలి గిరిజన మహిళగా చరిత్ర సృష‍్టించారు ద్రౌపది ముర్ము. ఎన్డీఏ బలపరిచిన ఈమెకు బీజేడీ, వైఎస్‌ఆర్‌సీపీ, జేఎంఎం వంటి ప్రాంతీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో ఆమె ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు. ముర్ము విజయంతో ఒడిశాలోని ఆమె స్వగ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.

చదవండి: కొత్త చరిత్ర.. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము

Advertisement
 
Advertisement
Advertisement