కొత్త చరిత్ర.. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము | Sakshi
Sakshi News home page

President Droupadi Murmu: కొత్త చరిత్ర.. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము

Published Thu, Jul 21 2022 7:50 PM

NDA Candidate Draupadi Murmu Elected As A 15th President of India - Sakshi

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ద్రౌపది ముర్ము నిలిచారు. ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో దిగిన ముర్ము విజయ దుందుభి మోగించారు. సగానికి పైగా ఓట్లు సాధించి ప్రత్యర్థి యశ్వంత్‌ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు.

ద్రౌపది ముర్ముకు బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలతోపాటు బీజేడీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సహా 44 పార్టీలు మద్దతిచ్చాయి. దీంతో ఆమె ఎలక్టోరల్ కాలేజ్‌లో అవసరమైన మెజార్టీకి మించి ఓట్లు సాధించారు. 63 శాతం ఓట్లతో విజయ కేతనం ఎగరవేశారు. ఈ నెల 25న దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేస్తారు.
చదవండి👇
రెండు సార్లు రాష్ట్రపతిగా పనిచేసింది ఎవరు?)
ఏంటిది? మోదీ ప్రారంభించిన ఎక్స్‌ప్రెస్‌వేపై ఐదు రోజులకే గుంతలు..

Advertisement
 
Advertisement