విమానంలో ప్రయాణికుల ఫైట్‌ | Passengers Fight Mid Flight On Chennai Flight Amid Bomb Threat, Watch Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

విమానంలో ప్రయాణికుల ఫైట్‌

Jan 27 2025 12:57 PM | Updated on Jan 27 2025 1:49 PM

passengers get fight Chennai flight video goes viral

సాక్షి, చెన్నై: కొచ్చి నుంచి చెన్నైకు వచ్చిన విమానం గాల్లో ఉండగా ఇద్దరు ప్రయాణికులు ముష్టి యుద్ధానికి దిగారు. సినీ ఫైట్‌ను తలపించే విధంగా సాగిన ఈ ఫైట్‌ చెన్నై విమానాశ్రయంలో టెన్షన్‌ రేపింది. కేరళ రాష్ట్రం కొచ్చి నుంచి చెన్నైకు శనివారం రాత్రి 171 మంది ప్రయాణికులతో విమానం చెన్నైకు బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా కేరళకు చెందిన డేవిస్‌(35), అమెరికాకు చెందిన కసన్‌ ఎలియా(32) ప్రయాణికుడి మధ్య వాగ్వాదం ముదిరి, ఇద్దరూ ముష్టియుద్ధానికి దిగారు. 

వీరిని వారించేందుకు తోటి ప్రయాణికులు ప్రయతి్నంచి విఫలమయ్యారు. విమానంలోకి సిబ్బంది బుజ్జగించారు. అయితే ఇద్దరూ ఏ మాత్రం తగ్గకపోగా వారు ఇచ్చిన హెచ్చరికలు ఇతర ప్రయాణికులకు ముచ్చెమటులు పట్టించాయి. తమ వద్ద బాంబులు ఉన్నట్టు దాడికి రెడీ అని ఆ ఇద్దరు పరస్పరం హెచ్చరించడంతో ఉత్కంఠ నెలకొంది. 

దీంతో ఈ విషయాన్ని చెన్నై విమానాశ్రయానికి ఫైలట్లు సమాచారం అందించారు. చేసేది లేక విమానాన్ని అర్ధరాత్రి 12 గంటల  సమయంలో ల్యాండింగ్‌ చేశారు. రిమోట్‌ ఏరియాకు తరలించారు. భద్రతా బలగాలు పరుగులు తీశాయి. ఆ ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నాయి. విమానంలోని అందరి బ్యాగ్‌లను తనిఖీలు చేశారు. క్షుణ్ణంగా తనిఖీల తర్వాత విమానంలో ఉన్న ప్రయాణికులను రాత్రి 2.30 గంటల సమయంలో బయటకు పంపించారు. ఆ ఇద్దర్ని అరెస్టు చేసి ప్రశ్నించారు.  

Advertisement
 
Advertisement
Advertisement