పాకిస్తాన్‌ దుశ్చర్య : ఆరుగురు మృతి | Pakistan Shoots In Jammu Kashmir | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ దుశ్చర్య : ఆరుగురు మృతి

Nov 13 2020 4:03 PM | Updated on Nov 13 2020 5:38 PM

Pakistan Shoots In Jammu Kashmir - Sakshi

శ్రీనగర్‌  జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో పాకిస్తాన్‌ మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. ఎల్‌వోసీ వెంబడి కాల్పులకు తెగబడి రక్తపాతం సృష్టించింది. ఈ కాల్పుల్లో భారత్‌కు చెందిన ఆరుగురు పౌరులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు జవాన్లు, నలుగురు పౌరులు ఉన్నారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరోవైపు కాల్పులు పలు ఇళ్లు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితి నేపథ్యంలో భద్రతాదళాలు మరింత అప్రమత్తం అయ్యాయి. పాకిస్తాన్‌ చర్యపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement