పద్మనాభ స్వామి ఆలయం మూసివేత

Padmanabhaswamy Temple Closed Till October 15 After Staff COVID Positive - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రసిద్ధి చెందిన కేరళలోని పద్మనాభ స్వామి ఆలయం ప్రధాన పూజారి, సంయుక్త ప్రధాన పూజారి సహా మొత్తం పదిమంది ఆలయ పూజారులు ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడడంతో ఆలయాన్ని అక్టోబర్‌ 15వ తేదీ వరకు తాత్కాలిక ప్రాతిపదికపై మూసివేశారు. ఇప్పటి వరకు ప్రత్యేక పూజలు మాత్రమే నిర్వహిస్తూ వచ్చిన  తంత్రి ఇక రోజువారి పూజలు నిర్వహిస్తారని,  రోజు వారి పూజలకు భక్తులను అనుమతించరని ఆలయ ఎగ్జిక్యూటివ్‌ అధికారి రథీసన్‌ తెలియజేశారు. 

భారత్‌లో శుక్రవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 69,06,151 చేరుకుందని, గడచిన 24 గంటల్లో దేశం మొత్తం 70,496 చేరుకుందని, ఇక మొదట్లో కరోనా మృతుల సంఖ్య  964 ఉండగా ఇప్పుడు మరణాల సంఖ్య అనూహ్యంగా కేసుల సంఖ్య లక్షా ఆరువేల నాలుగు వందల తొంభై. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3.64 కోట్లకు చేరుకుందని, మరణాల సంఖ్య10, 50, 869 చేరుకుందని జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్శిటీ వర్గాలు వివరించాయి. కరోనా బారిన పడిన వారిలో దాదాపు 2.53 కోట్లకు చేరుకుందని చెప్పాయి.  (వచ్చే నెల్లో కోవిడ్‌ వ్యాక్సిన్‌!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top