‘అది ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ కాదు.. యుద్ధ విమానం’ | Not like a fridge Air chief on US F 35 jets | Sakshi
Sakshi News home page

‘అది ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ కాదు.. యుద్ధ విమానం’

Mar 8 2025 6:55 PM | Updated on Mar 8 2025 7:38 PM

Not like a fridge Air chief on US F 35 jets

న్యూఢిల్లీ:  ఇటీవల  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎఫ్-35 ఫైటర్ జెట్ విమానాలను భారత్ కు అమ్మడానికి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో అధునాతన ఐదో తరం ఎఫ్ 35 జెట్ విమానాలను భారత్ కు విక్రయించడానికి ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే  ఈ ఒక్కో ఫైటర్ జెట్ విమానం విలువ 80 మిలియన్ డాలర్లు( సుమారు రూ. 680 కోట్లు) ఉంటుంది. 

ఇలా వెళ్లి అలా తెచ్చుకునే వస్తువు కాదు..
అయితే దీనిపై భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్  ఏపీ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే కాంక్లేవ్ లో ఏపీ సింగ్ మాట్లాడుతూ.. ఈ జెట్ ఫైటర్స్ ను పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అది ఏమీ మార్కెట్  కు ఇలా వెళ్లి అలా తెచ్చుకునే వాషింగ్ మిషీన్, ఫ్రిడ్జ్ లాంటి కాదని వ్యాఖ్యానించారు. 

ప్రస్తుతం భారత్ కు అధునాతన యుద్ధ విమానాల ఆవశక్యత ఉందంటూనే, మనం వాటిని కొనుగోలు చేసే క్రమంలో టెక్నాలజీని అన్ని విధాలు పరిక్షీంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ ఒక జెట్ ఫైటర్ ను కొనుగోలు చేస్తున్నామంటే దాని సామర్థ్యంతో పాటు దాని ఖరీదును కూడా బేరీజు వేసుకోవాలన్నారు. ఆ జుట్‌ ఫైటర్స్‌ ను కొనుగోలు చేయడానికి ఇంకా తమకే అమెరికా నుంచి ఆపర్‌ ఏమీ రాలేదని, వచ్చినప్పుడు  దానిపై సమ గ్రంగా పరిశీలన చేసిన నిర్ణయం తీసుకుంటామన్నారు

మన దేశం నుంచి 2035లోనే..
ప్రస్తుతం చైనా ఆరో జనరేషన్ యుద్ధ విమానాలను వాడటానికి సిద్ధమైన క్రమంలో మనం ఇంకా ఐదో జనరేషన్ ప్రోగ్రామ్ లో ఉన్నామన్నారు. మన దేశ ఐదవ తరం ఫైటర్ జెట్ ప్రోగ్రామ్‍ లో భాగంగా అడ్వాన్స్‌డ్‌ ఇండియా కాంబేట్ ఎయిర్ క్రాప్ట్(ఏఎంసీఏ) ఇంకా  అభివృద్ధి దశలోనే ఉందని, మన దేశం నుంచి అధునాతన యుద్ధ  విమానం  2035లో అందుబాటులోకి రావచ్చని పేర్కొన్నారు. అప్పటివరకూ యుద్ధ విమానాలను బయట నుంచే తెచ్చుకోక తప్పదన్నారు. ప్రస్తుత తరుణంలో చైనా ఆరో తరం ఫైటర్ జెట్ ల వాడకానికి సిద్ధం కాగా, పాకిస్తాన్ ఎఫ్ 16 ఫైటర్ జెట్ ల కోసం అమెరికా నుంచి నిధులు సమకూరుస్తున్న తరుణంలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సి న అవసరం ఉందని ఏపీ సింగ్ తేల్చి చెప్పారు. 

ఎఫ్‌-35.. అంతు ‘చిక్కదు’

Advertisement
 
Advertisement
Advertisement