కాంగ్రెస్‌ వల్లే ‘ఇండియా’లో వేడి తగ్గింది: నితీశ్‌ కుమార్‌ | Nitish Kumar says nothing happening in INDIA bloc | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ వల్లే ‘ఇండియా’లో వేడి తగ్గింది: నితీశ్‌ కుమార్‌

Nov 3 2023 5:56 AM | Updated on Nov 3 2023 5:56 AM

Nitish Kumar says nothing happening in INDIA bloc - Sakshi

పట్నా:  విపక్ష ‘ఇండియా’ కూటమి స్తబ్ధుగా మారిపోయిందని, ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్‌ పారీ్టయే అందుకు కారణమని జేడీ(యూ) సీనియ ర్‌ నేత, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ మునిగిపోయిందని, దాంతో ఇండియా కూటమిలో వేడి తగ్గిందని అన్నా రు. గురువారం బిహార్‌ రాజధాని పట్నాలో సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన సభలో నితీశ్‌ ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీ పాలనను వ్యతిరేకించే పారీ్టలు ఒకే వేదికపైకి వచ్చాయని, ఆ కూటమిలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement