జేడీ(యూ) ఎల్పీ భేటీకీ ఎమ్మెల్యేలు డుమ్మా | Nitish Kumar Faces Floor Test To Prove Its Majority In The Assembly, Three JDU MLAs Absent In Patna Meeting - Sakshi
Sakshi News home page

Bihar Assembly Floor Test: జేడీ(యూ) ఎల్పీ భేటీకీ ఎమ్మెల్యేలు డుమ్మా

Published Mon, Feb 12 2024 6:19 AM

Nitish Kumar Faces Floor Test, Three JDU MLAs Absent In Patna Meeting - Sakshi

పాట్నా: సీఎం నితీశ్‌ కుమార్‌ సర్కారుపై అసెంబ్లీలో సోమవారం జరిగే విశ్వాస పరీక్షలో నెగ్గుతామని అధికార జేడీయూ ధీమా వ్యక్తం చేసింది. శనివారం సీఎం నితీశ్‌ ఇచ్చిన విందుకు కొందరు డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. అలాగే, ఆదివారం మంత్రి విజయ్‌ కుమార్‌ చౌదరి అధ్యక్షతన జరిగిన పార్టీ శాసనసభా పక్షం భేటీకి సైతం కొందరు గైర్హాజరవడం కలకలం రేపింది.

ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పనిసరి పరిస్థితుల్లో గైర్హాజరయ్యారని చౌదరి చెప్పారు. తొలుత ఆర్జేడీకి చెందిన స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం, అనంతరం ప్రభుత్వంపై విశ్వాస పరీక్షలో వారంతా ఓటేస్తారన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్‌ కుమార్‌ జేడీయూ ఎల్పీ భేటీలో పాల్గొనడం విశేషం. సోమవారం వామపక్ష సభ్యులతో కలిసి ఆర్‌జేడీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటారని తెలిసింది. వారం రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసిన 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆదివారం పటా్న చేరారు.

Advertisement
 
Advertisement