బిహార్ సీఎంగా పదోసారి ప్రమాణం చేయబోతున్న జేడీ(యూ) అధినేత
ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా నితీశ్ ఎన్నిక
బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా సామ్రాట్ చౌదరి
అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్‌కుమార్
పట్నా: జనతాదళ్(యునైటెడ్) అధ్యక్షుడు నితీశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా నేడు పదోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గురువారం జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రాజధాని పట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–జేడీ(యూ)తో కూడిన ఎన్డీయే అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నితీశ్ కుమార్ ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. సీఎం పదవికి బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు అందజేశారు. నితీశ్ రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు బిహార్ బీజేపీ అధ్యక్షుడు జైస్వాల్ చెప్పారు. నూతన ప్రభు త్వం ఏర్పాటయ్యేదాకా ఆపద్ధర్మ సీఎంగా వ్యవహ రించాలంటూ నితీశ్ కుమార్‌ను కోరారని తెలిపారు.
కేబినెట్‌లో 30 మందికిపైగా స్థానం
బిహార్ ఎన్డీయే ఎమ్మెల్యేలంతా బుధవారం సమావేశమయ్యారు. తమ శాసనసభాపక్ష నేతగా నితీశ్ కుమార్‌ను ఎన్నుకున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా సామ్రాట్ చౌదరి, ఉప నేతగా విజయ్‌కుమార్ సిన్హా ఎన్నికయ్యారు. ఈ భేటీకి ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కేంద్ర పరిశీలకుడిగా వ్యవహరించారు. కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, కేంద్ర మాజీ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సహ పరిశీలకులుగా హాజరయ్యారు. మరోవైపు కేబినెట్ పదవుల పంపకంపై ఎన్డీయే పారీ్టల మధ్య సంప్రదింపులు కొనసాగాయి. 30 మందికిపైగా ఎమ్మెల్యేలను కొత్త మంత్రివర్గంలో చేర్చుకొనే అవకాశం కనిపిస్తోంది.

వీరిలో 16 మంది బీజేపీ నుంచి, 14 మంది జేడీ(యూ) నుంచి ఉంటారని సమాచారం. బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్ కుమార్‌ను అసెంబ్లీ స్పీకర్‌గా నియమించేలా అంగీకారం కుదిరినట్లు ఎన్డీయే వర్గాలు తెలిపాయి. డిప్యూటీ స్పీకర్ పదవి జేడీ(యూ)కు దక్కనుంది. కేబినెట్‌లో ఐదు నుంచి ఆరు కొత్త ముఖాలకు చోటు కల్పిస్తారని ప్రచారం సాగుతోంది. ఎన్డీయే భాగస్వామ్యపక్షాలైన ఎల్జేపీ(రామ్‌విలాస్), హిందుస్తానీ అవామీ మోర్చా(సెక్యులర్), రా్రïÙ్టయ లోక్‌మోర్చా కూడా మంత్రివర్గంలో చేరబోతున్నాయి. అయితే, ఏ పారీ్టకి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారన్నది ఇంకా ఖరారు కాలేదు.


