నేను రాజుని.. ఇంటి బ‌య‌ట‌కు పిలిచి ఆగి ఉన్న కార్ల మ‌ధ్యలో దారుణం

Neighbor Stabbed Woman Multiple Times In Delhi Rohini Sector-11 Area - Sakshi

ఆ నేను రాజుని 

ఒక్క‌సారి ఇంటి బ‌య‌ట‌కు రా అంటూ పిలిచి 

ఆగి ఉన్న కార్ల మ‌ధ్య దారుణం   

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ‌రో దారుణం జ‌రిగింది. ఓ వ్యక్తి 28ఏళ్ల మ‌హిళ‌పై క‌త్తితో దాడి చేశాడు. ఈ దాడిలో గాయ‌ప‌డ్డ బాధితురాలు చావు బ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్న‌ట్లు సమాచారం. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సెక్టార్ -11 ప్రాంతానికి చెందిన న‌రేష్ అలియాస్ రాజు అనే వ్య‌క్తి నివాసం ఉంటున్నాడు.అయితే ఈ నేప‌థ్యంలో గురువారం సాయంత్రం రాజు ఇంటి ప‌క్క‌నే ఉన్న బాధితురాల్ని ఒక్క‌సారి బ‌య‌ట‌కు రావాల‌ని కోరాడు.

అందుకు బాధితురాలు ఎవ‌రు అని ప్ర‌శ్నించ‌గా.. ఆ నేను రాజుని అంటూ నిందితుడు బ‌దులిచ్చాడు. దీంతో ఓ.!రాజు నువ్వా అంటూ  బ‌య‌ట‌కు వ‌చ్చిన బాధితురాల్ని ఆగి ఉన్న కార్ల మ‌ధ్య కార్న‌ర్ చేసి క‌త్తితో ప‌లుమార్లు దాడి చేశాడు. ఆ స‌మ‌యంలో స్థానికులు చోద్యం చూస్తున్న‌ట్లు చూస్తున్నారే త‌ప్పా నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. పలుమార్లు బాధితురాల్ని కసితీరా పొడిచిన నిందితుడు అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. అనంత‌రం స్థానికులు బాధితురాల్ని అత్య‌వ‌స‌ర చికిత్స కోసం సఫ్ద‌ర్ గంజ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 

ఈ ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన పోలీసులు నిందితుడిపి అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది.

చ‌ద‌వండి : ఏంటి సార్ ! మా నాన్నకి అంత్య‌క్రియ‌లు చేయ‌డం కూడా త‌ప్పేనా
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top