NEET-UG 2024: నీట్‌ కౌన్సెలింగ్‌ వాయిదాకు సుప్రీం నో  | NEET-UG 2024: Supreme Court Refuses To Postpone Counselling From July 6 | Sakshi
Sakshi News home page

NEET-UG 2024: నీట్‌ కౌన్సెలింగ్‌ వాయిదాకు సుప్రీం నో 

Jun 22 2024 5:20 AM | Updated on Jun 22 2024 5:20 AM

NEET-UG 2024: Supreme Court Refuses To Postpone Counselling From July 6

సాక్షి, న్యూఢిల్లీ: జూలై 6 నుంచి జరగాల్సిన నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్‌ పరీక్షలో అక్రమాలపై దర్యాప్తు కోరుతూ దాఖలైన ప్రధాన పిటిషన్లపై విచారణను కోర్టు ఇప్పటికే జూలై 8కి వాయిదా వేయడం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌ను కూడా ఆ తేదీ దాకా వాయిదా వేయాలని పిటిషనర్లు కోరారు. జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ శుక్రవారం అందుకు నిరాకరించింది. విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement
 
Advertisement
Advertisement