Viral: Congress Leader Navya Sree Says Rajkumar Takale Is My Husband - Sakshi
Sakshi News home page

Navya Sree-Rajkumar: ఆయనే నా భర్త.. ఇదే సాక్ష్యం: కాంగ్రెస్‌ నేత నవ్యశ్రీ

Jul 21 2022 7:19 AM | Updated on Jul 21 2022 8:36 AM

Navya Sree Says Rajkumar Takale Is My Husband - Sakshi

కాంగ్రెస్‌ నాయకురాలు నవ్య శ్రీ రావు ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది.

యశవంతపుర: కర్నాటకలోని బెళగావి కాంగ్రెస్‌ నాయకురాలు, సామాజిక కార్యకర్త నవ్య శ్రీ రావు ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమె నా భార్య కాదంటూ హార్టికల్చర్‌ విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజకుమార టాకళె  తెలిపారు. తమ ఇద్దరికీ పెళ్లి జరిగినట్లు సాక్ష్యాలు లేవన్నారు. ఆమె నా భార్య కాకపోయినా పదేపదే భార్య అని ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. మూడు నెలల నుంచి నవ్యశ్రీ మానసికంగా హింసిస్తోందన్నారు. 

కష్టాల్లో ఉంటే ఆదుకున్నా
నాకు భార్య, పిల్లలున్నారు. ఆమె కష్టాల్లో ఉందని నన్ను కలిస్తే  ఎంతో సాయం చేశాను. రూ.రెండు లక్షలు ఇచ్చా, ఇప్పుడు నన్ను బ్లాక్‌ మెయిల్‌ చేస్తోందని టాకళె అన్నారు. పోలీసులు విచారణ జరిపి న్యాయం చేయాలన్నారు. మరోవైపు వారిద్దరూ అన్యోన్యంగా ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఎవరు చెప్పేది అబద్ధం, ఎవరిది నిజం? అని గందరగోళం ఏర్పడింది.

ఆమె రూ.50 లక్షలు ఇవ్వాలని వేధిస్తోందని, ఇందుకు కొన్ని వీడియోలను వాడుకుంటోందని టాకళె చెప్పారు. ఆమె నుంచి కాపాడాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు నవ్యశ్రీ మాత్రం తమకిద్దరికీ పెళ్లయిందని స్పష్టం చేసింది. ఇప్పుడు తాను ఎవరో తెలియదని నాటకమాడుతున్నారని పేర్కొంది. వారిద్దరి సన్నిహిత వీడియోలు వైరల్‌ కావడం జిల్లా అంతటా చర్చనీయాంశమైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement