నాన్న మృతదేహం నాకొద్దు.. వాటిని మాత్రం నాకు పంపండి

Mysore: Son Want Money Documents Not Do Fathers Funeral Corporator - Sakshi

మైసూరు: కరోనా రక్కసి అనుబంధాలను తుడిచేస్తోంది. మరణించిన తండ్రి మృతదేహం తనకు వద్దని, మీరే తగులబెట్టుకోండి, అతని వద్ద ఉన్న రూ.6 లక్షల విలువైన డబ్బులు, డాక్యుమెంట్లను తెచ్చి ఇవ్వండంటూ ఒక కుమారుడు చాలా పరుషంగా మాట్లాడాడు. మైసూరు హెబ్బాళలో ఉన్న సూర్య బేకరి వద్ద ఒక ఇంట్లో వృద్ధుడు కరోనాతో మరణించాడు.

అతని కొడుకు కువెంపు నగర శాంతి సాగర్‌ కాంప్లెక్స్‌ వద్ద నివసిస్తుంటాడు. కుమారుడు స్థానిక కార్పొరేటర్‌ కేవీ శ్రీధర్‌కు ఫోన్‌ చేసి తన తండ్రి అంత్యక్రియలను మీరే పూర్తి చేసి, అతని వద్ద ఉన్న రూ. 6 లక్షల డబ్బులు, ఆస్తి పత్రాలను మాత్రం తనకు తెచ్చి ఇవ్వాలని చెప్పాడు. కొడుకు వైఖరికి విస్తుపోయిన కార్పొరేటర్‌ పాలికె సిబ్బందితో అంత్యక్రియలు చేయించారు. 

చదవండి: Lockdown: వందలాది మంది ఒక్కచోట చేరి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top