హిజాబ్‌ బ్యాన్‌.. బాంబే హైకోర్టు కీలక తీర్పు | Mumbai High Court Order In Hijab Ban In College | Sakshi
Sakshi News home page

కాలేజీలో హిజాబ్‌ బ్యాన్‌.. బాంబే హైకోర్టు కీలక తీర్పు

Jun 26 2024 12:53 PM | Updated on Jun 26 2024 1:05 PM

Mumbai High Court Order In Hijab Ban In College

ముంబై: మహారాష్ట్ర రాజధాని  ముంబైలోని ఓ కళాశాల యాజమాన్యం తీసుకున్న హిజాబ్‌ నిషేధ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. 

హిజాబ్‌ నిషేధిస్తూ కాలేజీ యాజమన్యం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ తొమ్మిది మంది విద్యార్థినులు వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఏఎస్‌ చందుర్కర్‌, జస్టిస్‌ రాజేష్‌ పాటిల్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం (జూన్‌26) విచారించింది. 

కాలేజీ నిర్ణయం రాజ్యాంగం తమకు ఇచ్చిన ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తోందని విద్యార్థినులు పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే  కాలేజీ యాజమాన్యం నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ డివిజన్‌ బెంచ్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.

చెంబూర్‌ ట్రాంబే ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలోని ఎన్‌జీ ఆచార్య, డీకే మరాఠే కళాశాలల్లో విద్యార్థినులు హిజాబ్‌, నఖాబ్‌, బుర్ఖా, క్యాపులు, బ్యాడ్జీలు ధరించడానికి వీల్లేదని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. 

తాము ఏ మతానికి వ్యతిరేకంగా ఎలాంటి డ్రెస్‌ కోడ్‌ పెట్టలేదని, కేవలం యూనిఫాం వేసుకుని విద్యార్థులందరూ క్రమశిక్షణతో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కాలేజీ యాజమాన్యం కోర్టుకు తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement