పాక్‌ గాలితీసిన భారత మాజీ ఆర్మీచీఫ్‌ | mm naravane says pakistan doing just courier service | Sakshi
Sakshi News home page

పాక్‌ గాలితీసిన భారత మాజీ ఆర్మీచీఫ్‌

Jun 7 2026 7:27 AM | Updated on Jun 7 2026 7:39 AM

mm naravane says pakistan doing just courier service

కోల్‌కతా: భారత రిటైర్డ్‌ ఆర్మీ చీఫ్ ఎం.ఎం నరవణే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్- అమెరికా మధ్య పాక్‌ మధ్యవర్తిత్వం ఒట్టిమాటే అన్నారు. పాక్‌ చేసేది మధ్యవర్తిత్వం కాదని కేవలం కొరియర్‌ సర్వీస్‌ మాత్రమేనన్నారు. కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత మాజీ సైన్యాధిపతి నరవణే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన రాసిన "ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్ డెస్టినీ" పుస్తకం విడుదల కాకముందే దేశంలో ప్రకంపనలు సృష్టించింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఈ పుస్తకంలోని పలు అంశాలను ప్రస్థావించడంతో లోక్‌సభలో పెద్ద దుమారం చేలరేగింది. కాగా తాజాగా నరవణే పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై మాట్లాడారు.

నరవణే మాట్లాడుతూ" ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలలో పాక్‌ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు చెబుతోంది. కానీ అది కేవలం కొరియర్ సర్వీస్ మాత్రమే, జాతీయ భద్రత ఎప్పుడూ ఆర్థిక భద్రతపైనే ముడిపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థే అన్నింటిని నడిపిస్తోంది. భవిష్యత్తులో ఎలాంటి ఒడిదొడుకులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.ప్రపంచ వాణిజ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రయత్నాలు ఎల్లప్పుడూ స్వయం సమృద్ధిపైనే ఉండాలి" అని అన్నారు.

ఇటీవల పాకిస్థాన్‌ ఇస్లామాబాద్ వేదికగా అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరిగాయి. కాగా ఇవి ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందం పాటిస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధంతో హర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేసింది. దీంతో చమురు రవాణాకు ఆటంకం తలెత్తి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement