అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త | Married Woman Ends Life In Karnataka | Sakshi
Sakshi News home page

అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

Apr 19 2025 8:06 AM | Updated on Apr 19 2025 8:06 AM

Married Woman Ends Life In Karnataka

కర్ణాటక: భార్యపై అనుమామానం పెంచుకొని తలపై బండరాయి వేసి కడతేర్చిన భర్త ఉదంతం మండ్య జిల్లా, శ్రీరంగ పట్టణ తాలూకా బాబురాయనకొప్పలు గ్రామంలో జరిగింది.  తాలూకాలోని పి.హోసహళ్లికి చెందిన వీరభద్రాచారి కుమారుడు చంద్ర అనే వ్యక్తితో  పాండవపుర తాలూకా సణబ గ్రామానికి చెందిన సౌమ్య(32)తో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. చంద్ర  కూలీ పనులు చేసేవాడు.  

రెండేళ్లుగా బాబురాయన కొప్పలు గ్రామంలో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన చంద్ర భార్యతో గొడవపడేవాడు. సౌమ్యకు మరో వ్యక్తితో  సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. గురువారం రాత్రి ఇదే విషయంపై గొడవపడి బండరాయిని ఆమె తలపై వేసి ఉడాయించాడు. సౌమ్య తీవ్ర గాయాలతో మృతి చెందింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడు చంద్ర కోసం గాలిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement