మణిపూర్‌లో దుండగుల మెరుపుదాడి | Sakshi
Sakshi News home page

మణిపూర్‌లో దుండగుల మెరుపుదాడి

Published Wed, Jan 17 2024 12:20 PM

Manipur Security Officer Killed As Militants Ambush In Moreh - Sakshi

ఇంఫాల్: మణిపూర్‌లోని మోరే పట్టణంలో బుధవారం తెల్లవారుజామున కాల్పుల మోత మోగింది. భద్రతా బలగాలను లక్ష‍్యంగా చేసుకుని దుండగులు రెండుసార్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది సైనికులు గాయపడ్డారు.

బుధవారం తెల్లవారుజామున ఎమా కొండోంగ్ లైరెంబి దేవి మందిర్ సమీపంలో భద్రతా బలగాలు నిద్రిస్తున్నాయి. ఈ క్రమంలో దుండగులు దాడులు జరిపారు. చికిమ్ విలేజ్ కొండపై నుండి కాల్పులు జరిపారు. ఈ ఘటనకు కేవలం 20 మీటర్ల దూరంలో ఉన్న అసోం రైఫిల్స్ రంగంలోకి దిగి ఎదురుకాల్పులు జరిపారు. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని గాలింపు చేపట్టారు.

మళ్లీ గంట తర్వాత ఉదయం 5:10 నిమిషాలకు మరోసారి కాల్పులు జరిగాయి. ఎస్‌బీఐ బ్యాంక్ బిల్డింగ్ దేఖునాయ్ రిసార్ట్ వద్ద మోహరించిన భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు మరొక ఆకస్మిక దాడి చేశారు. రెండోసారి జరిపిన దాడిలో ఓ అధికారి మరణించారు. మరికొంతమంది సైనికులు గాయపడ్డారు. 

ఇదీ చదవండి: రిపబ్లిక్ డే వేళ ఢిల్లీలో గోడలపై ఖలిస్థానీ రాతల కలకలం


 

Advertisement
 
Advertisement
 
Advertisement