breaking news
mithayi
-
మణిపూర్‌లో దుండగుల మెరుపుదాడి
ఇంఫాల్: మణిపూర్‌లోని మోరే పట్టణంలో బుధవారం తెల్లవారుజామున కాల్పుల మోత మోగింది. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు రెండుసార్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది సైనికులు గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఎమా కొండోంగ్ లైరెంబి దేవి మందిర్ సమీపంలో భద్రతా బలగాలు నిద్రిస్తున్నాయి. ఈ క్రమంలో దుండగులు దాడులు జరిపారు. చికిమ్ విలేజ్ కొండపై నుండి కాల్పులు జరిపారు. ఈ ఘటనకు కేవలం 20 మీటర్ల దూరంలో ఉన్న అసోం రైఫిల్స్ రంగంలోకి దిగి ఎదురుకాల్పులు జరిపారు. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని గాలింపు చేపట్టారు. మళ్లీ గంట తర్వాత ఉదయం 5:10 నిమిషాలకు మరోసారి కాల్పులు జరిగాయి. ఎస్బీఐ బ్యాంక్ బిల్డింగ్ దేఖునాయ్ రిసార్ట్ వద్ద మోహరించిన భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు మరొక ఆకస్మిక దాడి చేశారు. రెండోసారి జరిపిన దాడిలో ఓ అధికారి మరణించారు. మరికొంతమంది సైనికులు గాయపడ్డారు. ఇదీ చదవండి: రిపబ్లిక్ డే వేళ ఢిల్లీలో గోడలపై ఖలిస్థానీ రాతల కలకలం -
చిటారు కొమ్మన మిఠాయి పొట్లం
‘వెళ్లొస్తా’ అనే మాట చేదుగా ఉంటుంది. మరేమిటి ఈ స్వీట్ టాపిక్?! తియ్యటి జ్ఞాపకాలను మళ్లొకసారి పంచుకోడానికి! తియ్యటి భవిష్యత్తు ముందుందని చెప్పుకోడానికి! వీడ్కోలైనా, వెల్కమ్ అయినా... జీవితంలోని తియ్యదనం ఎక్కడికీ పోదు. మనతోనే ఉంటుంది. మనతోనే వస్తుంది. ఇప్పుడెక్కడున్నాం? 2013 చిటారు కొమ్మపైన కదా!! ఆ కొమ్మన ఉన్న 2014 మిఠాయి పొట్లాన్ని కూడా కిందికి తెచ్చేసుకుందాం. వెళ్లేవారికి, వచ్చేవారికి ఇచ్చేసుకుందాం. విష్ యు ఎ హ్యాపీ అండ్ తీపీ న్యూ ఇయర్! స్టికీ రైస్ పుడింగ్ కావలసినవి: స్టికీ బియ్యం - కప్పు, బ్రౌన్ సుగర్ - 6 టేబుల్ స్పూన్లు (ఇది మాదక ద్రవ్యం కాదు, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది), కొబ్బరిపాలు - 400 మి.లీ., బటర్ - 2 టీ స్పూన్లు, పండ్లముక్కలు - కప్పు (అనాస, బొప్పాయి, ఆపిల్, దానిమ్మ, అరటి, కమల వంటివి), పిస్తా - 15 (సన్నగా కట్ చేయాలి), దాల్చినచెక్క పొడి - చిటికెడు, గార్నిషింగ్ కోసం: జీడిపప్పు + బాదంపప్పు + పిస్తా పప్పు - రెండు టేబుల్ స్పూన్లు (సన్నగా తరగాలి) తయారి: బియ్యాన్ని కడిగి సుమారు రెండు గంటలు నానబెట్టాలి ఒక పాత్రలో రెండు కప్పుల నీరు పోసి మరిగించాక, నానబెట్టుకున్న బియ్యం జతచేయాలి ఒక పాన్‌ను స్టౌ మీద ఉంచి అందులో బటర్ వేసి కరిగాక, తరిగి ఉంచుకున్న పండ్ల ముక్కలు వేసి కొద్దిగా వేయించి తీసి పక్కన ఉంచాలి అదే పాత్రలో సగం కొబ్బరిపాలు (200 మి.లీ.), అన్నం వేసి బాగా కలపాలి మిగిలిన కొబ్బరిపాలు జత చేసి, పాలు ఇగిరే వరకు ఉడికించి, బ్రౌన్‌సుగర్ జత చేసి పంచదార కరిగేవరకు ఉడికించాలి ఒక ప్లేట్లో అన్నం వేసి సమానంగా పరిచి, పైన పిస్తా ముక్కలు, పండ్లముక్కలు వేయాలి ఆ పైన దాల్చిన చెక్క పొడి చల్లి, జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా పప్పు పలుకులతో గార్నిష్ చేయాలి. కస్టర్డ్ హల్వా కావలసినవి: కస్టర్డ్ పౌడర్ - కప్పు (వెనిలా ఫ్లేవర్), పంచదార - 3 కప్పులు, నీరు - 4 కప్పులు, నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు - 15 తయారి: ఒక ప్లేట్‌కి నెయ్యి పట్టించి పక్కన ఉంచాలి జీడిపప్పులు దోరగా వేయించి పక్కన ఉంచాలి ఒక పాత్రలో కస్టర్డ్ పౌడర్, పంచదార, నీరు వేసి ఉండలు లేకుండా కలపాలి స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక అందులో కస్టర్డ్ మిశ్రమం పోసి, చిక్కబడేవరకు ఆపకుండా కలుపుతుండాలి నెయ్యి జత చేసి (జెల్లీలా అయ్యేవరకు) కలుపుతుండాలి జీడిపప్పు పలుకులు వేసి కలిపి దించేయాలి నెయ్యి రాసి ఉన్న ప్లేట్లోకి తిరగతీసి, ముక్కలుగా కట్ చేయాలి. బ్లూబెర్రీ చీజ్ కేక్ కావలసినవి: క్రంబుల్డ్ వెనిలా స్పాంజ్ - ఒక కప్పు కంటె ఎక్కువ (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది), పంచదార పాకం - 2 టేబుల్ స్పూన్లు, బేసిక్ చీజ్ కోసం: పాలు - లీటరు, నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు, పంచదారపొడి - 5 టేబుల్ స్పూన్లు, తాజా క్రీమ్ - పావు కప్పు, క్రీమ్ చీజ్ - 2 టేబుల్ స్పూన్లు (సూపర్మార్కెట్లో దొరుకుతుంది), ఇంకా... బ్లూబెర్రీ క్రష్ - పావు కప్పు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది), నిమ్మరసం - టీ స్పూను, చిలకరించిన క్రీమ్ - కప్పు, గార్నిషింగ్ కోసం: బ్లూబెర్రీ క్రష్- 8 టేబుల్ స్పూన్లు తయారి: కేక్ టిన్‌లో స్పాంజ్ కేక్‌ను సమానంగా పరిచి, గట్టిగా ఒత్తాలి దాని మీద పంచదార పాకం ఒక పొరలా పోసి పక్కన ఉంచాలి 4 టేబుల్ స్పూన్ల పాలను పక్కన ఉంచి, మిగిలిన పాలను గిన్నెలో పోసి స్టౌ మీద ఉంచి మరిగాక దించేసి, అందులో నిమ్మరసం వేసి రెండు నిముషాలు ఉంచాలి పాలు బాగా విరిగాక, నీటిని ఒంపేసి, విరుగును గట్టిగా పిండేస్తే పనీర్ సిద్ధమవుతుంది పనీర్‌కి 4 టేబుల్ స్పూన్ల పాలు, పంచదార, తాజాక్రీమ్ జత చేసి, మిక్సర్‌లో వేసి మెత్తటిముద్దలా అయ్యేవరకు బ్లెండ్ చేసి, ఒక పాత్రలో పోసి, దానికి క్రీమ్ చీజ్ జత చేయాలి మరోసారి నీటిని వడపోసి పైన మిగిలిన మిశ్రమాన్ని పక్కన ఉంచాలి ఒకపాత్రలో బేసిక్ చీజ్ క్రీమ్ మిశ్రమం, బ్లూబెర్రీ క్రష్, నిమ్మరసం వేసి బాగా కలపాలి ముందుగా తయారుచేసి ఉంచుకున్న క్రీమ్‌ను పై మిశ్రమం మీద నెమ్మదిగా పోయాలి ఈ మొత్తం మిశ్రమాన్ని స్పాంజ్కేక్ బేస్ మీద పోసి ఫ్లాట్‌గా ఉన్న చాకుతో సమానంగా పరిచి, ఫ్రిజ్‌లో సుమారు గంటసేపు ఉంచి తీశాక, వేరే ప్లేట్లోకి తిరగదీసి సమానమైన ముక్కలుగా కట్ చేయాలి 2 టేబుల్ స్పూన్ల బ్లూబెర్రీ క్రష్‌ను ఒక్కో ముక్క మీద పోసి చల్లగా సర్వ్ చేయాలి. మొహంతాల్ కావలసినవి: శనగపిండి - 3 కప్పులు, నెయ్యి - ఒక కప్పు కంటె కొద్దిగా ఎక్కువ, పచ్చికోవా - పావు కప్పు, పంచదార - 2 కప్పుల కంటె ఎక్కువ, ఏలకులపొడి - అర టీ స్పూను, జాజికాయపొడి - చిటికెడు, బాదంపప్పులు - 10, పిస్తా పప్పులు - 10 (సన్నగా కట్ చేయాలి) తయారి: ఒక పాత్రలో శనగపిండి, కొద్దిగా నెయ్యివేసి బాగా కలిపి పదినిముషాలు ఉంచాలి బాణలిలో కప్పు నెయ్యి వేసి కరిగాక శనగపిండి మిశ్రమం వేసి సన్నని మంట మీద (గోధుమరంగులోకి మారేవరకు, కలుపుతూనే ఉండాలి) సుమారు అరగంటసేపు ఉడికించాలి కోవా జత చేసి, బాగా కలిపి, సన్న మంట మీద మరో ఏడు నిముషాలు ఉంచి (ఆపకుండా కలుపుతుండాలి) దించేయాలి మరో బాణలిలో పంచదార, తగినంత నీరు పోసి సన్న మంట మీద సుమారు 20 నిముషాలు (తీగ పాకం వచ్చే వరకు) ఉడికించి దించేయాలి శనగపిండి మిశ్రమానికి పంచదార జత చేసి, మిశ్రమం చిక్కబడేవరకు కలుపుతుండాలి ఏలకులపొడి, జాజికాయపొడి, బాదంపప్పు + పిస్తా పప్పుల ముక్కలు (సగం) వేసి కలపాలి ఒక ప్లేట్ లాంటి దాంట్లో ఈ మిశ్రమాన్ని పోసి గరిటెతో సమానంగా పరవాలి మిగిలిన బాదంపప్పు ముక్కలు, పిస్తాముక్కలను పైన చల్లి, చల్లారాక, కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి. గోల్ పాపిడి కావలసినవి: గోధుమపిండి - కప్పు, గసగసాలు - టీ స్పూను, నూనె - కొద్దిగా, నెయ్యి - 5 టేబుల్ స్పూన్లు, బెల్లం తురుము - ముప్పావు కప్పు, ఏలకులపొడి - టీ స్పూను, కొబ్బరితురుము - టీ స్పూను, గార్నిషింగ్కోసం: బాదంపప్పులు - 6 , పిస్తా పప్పులు - 10 (వీటిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి) తయారి: పెద్ద ప్లేట్‌కి నూనె పూసి, గసగసాలు చల్లాలి. స్టౌ మీద బాణలి ఉంచి అందులో నెయ్యి వేసి కరిగాక గోధుమపిండి వేసి బంగారురంగులోకి వచ్చేవరకు వేయించి దించేయాలి ఒక పెద్ద పాత్రలో బెల్లంతురుము, ఏలకులపొడి, కొబ్బరితురుము వేసి స్టౌ మీద ఉంచి బాగా కలపాలి బెల్లం కరిగాక గోధుమపిండి వేసి బాగా కలిపి వేడిగా ఉండగానే ఈ మిశ్రమాన్ని గసగసాలు వేసిన ప్లేట్లో పోసి, సమానంగాపరవాలి బాదంపలుకులతో గార్నిష్ చేసి, నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. మైక్రోవేవ్ పాలకోవా కావలసినవి: స్వీట్ కండెన్స్డ్ మిల్క్ - 400 గ్రా., తాజా పెరుగు - 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి - టీ స్పూను, నట్స్ - గార్నిషింగ్ కోసం తయారి: మైక్రోవేవ్ అవెన్ లో ఉంచే ఒక పెద్ద బౌల్ తీసుకుని దానికి నెయ్యి పట్టించాలి ఆ బౌల్లో కండెన్స్డ్ మిల్క్ పోయాలి తాజాపెరుగు జత చేసి కలపాలి మైక్రోవేవ్ అవెన్‌లో (800 w) దగ్గర సుమారు ఎనిమిది నిముషాలు (నిముషానికొకసారి చొప్పున కలపాలి) ఉంచాలి బాగా చిక్కబడిందనిపించాక తీసేయాలి నట్స్‌తో గార్నిష్ చేసి, సర్వ చేయాలి. - సేకరణ: డా. వైజయంతి