Sakshi News home page

రిజర్వేషన్లపై ఆందోళనలు.. మంత్రికి చేదు అనుభవం..

Published Fri, Sep 8 2023 9:31 PM

Man Throws Haldi At Maharashtra Minister - Sakshi

ముంబయి: రిజర్వేషన్ల అంశంలో మహారాష్ట్ర మంత్రి రాధాకృష్ణం విఖే పాటిల్‌కి చేదు అనుభవం ఎదురైంది. రిజర్వేషన్ కోసం డిమాండ్ చేస్తున్న అభ్యర్థులు మంత్రి రాధాకృష్ణం విఖే పాటిల్‌పై దురుసుగా ప్రవర్తించారు. మాట్లాడుతున్న క్రమంలో ఆయనపై పసుపు పోశారు. పక్కనే ఉన్న మంత్రి అనుయాయులు ఆ అభ్యర్థిపై విరుచుకుపడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

తమ రిజర్వేషన్ల పెంపు డిమాండ్‌పై మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్‌కు వినతిపత్రం ఇవ్వడానికి కొంత మంది అభ్యర్థులు వచ్చారు. వినతిపత్రం మంత్రికి అందించారు. ఆ లేఖను చదివే క్రమంలో మంత్రి తలపై పసుపును ఒక్కసారిగా పోశారు. ఈ అనుకోని సంఘటనతో ఆయన దూరంగా జరిగారు. 

పక్కనే ఉన్న మంత్రి అనుయాయులు ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పక్కకు తోశారు. అనంతరం అతనిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి.. తనపై పసుపు పోయడం శుభమేనని అన్నారు. ఇది తప్పుడు చర్య ఏం కాదని అన్నారు. దీనిని తాను సానుకూలంగా తీసుకున్నట్లు చెప్పారు.

తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఏకంగా రాష్ట్ర సీఎం మీద కూడా ఇంక్ పోస్తామని అభ్యర్థులు హెచ్చరించారు. తమ ధంగర్ కమ్యునిటీని షెడ్యూల్డ్ ట్రైబ్స్ కింద పరిగణించాలని డిమాండ్ చేశారు. అయితే.. మహారాష్ట్రలో కొన్ని రోజులుగా రిజర్వేషన్ల గొడవ కొనసాగుతోంది.    

ఇదీ చదవండి: ఢిల్లీకి చేరిన ఐఎంఎఫ్‌ చీఫ్‌.. ఫోక్ సాంగ్‌కు డ్యాన్సులు..

Advertisement

తప్పక చదవండి

Advertisement