మరణించాడనుకుంటే, మోమోలు తింటూ కనిపించాడు

Man Thought To Be Dead Found Eating Momos In Noida - Sakshi

భాగల్పూర్‌: బిహార్‌లో భాగల్పూర్‌కు చెందిన నిశాంత్‌ కుమార్‌ అనే వ్యక్తి గత ఆరు నెలలుగా కనిపించకుండా పోవడంతో  కుటుంబ సభ్యులందరూ ఆయన మరణించాడనే భావించారు. అయితే హఠాత్తుగా ఒక రోజు నోయిడాలో మోమోలు తింటూ ఆయన బావమరిదికే దొరకడం విశేషం. భాగల్పూర్‌లోని నౌగాచికి చెందిన నిశాంత్‌ కుమార్‌ ఒక పెళ్లి కోసం తన అత్త మామల ఇంటికి ఈ ఏడాది జనవరిలో వెళ్లాడు. ఆ తర్వాత కనిపించకుండా వెళ్లిపోయాడు. దీంతో సుశాంత్‌ తండ్రి తన కుమారుడిని అతని అత్తింటి సభ్యులే హత్య చేశాడని ఆరోపించారు.

రెండు కుటుంబాల మధ్య రచ్చ వీధికెక్కింది. సుశాంత్‌ బావమరిది ఒక రోజు నోయిడా వెళితే అక్కడ మోమోలు అమ్మే దుకాణం దగ్గర ఒక బిచ్చగాడు కనిపించాడు. అతను ఆకలేస్తోందని మోమోలు అడిగితే దుకాణం దారుడు అతనిని పొమ్మని కసురుకుంటున్నాడు. దీంతో జాలిపడ్డ రవిశంకరే డబ్బులు ఇచ్చి అతనికి మోమోలు ఇమ్మని చెప్పాడు. ఆ తర్వాత అతని పేరేంటని అడగ్గా నిశాంత్‌ కుమార్‌ అని తమది బిహార్‌ అని చెప్పడంతో నిర్ఘాంత పోయాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిశాంత్‌ నోయిడాకి ఎలా చేరాడో, ఎందుకు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడో పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top