సింహం, పులి, చిరుత.. వీటి పేర్లు వినగానే మన మనసులో ఎక్కడో భయం నెలకొంటుంది. ఒకవేళ ఈ అటవీ జంతువులు ఎదురైతే ఎవరైనా సరే ఒక్క ఉదుటున పరుగులందుకుంటారు. ఈ ప్రమాదకరమైన జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ ఇంటర్నెట్‌లో దర్శనమిస్తుంటాయి. వీటిలో కొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో తొలుత ఒక వ్యక్తి రహదారి గుండా హాయిగా నడుచుకుంటూ వెళుతున్నట్లు కనిపిస్తాడు. ఇంతలో అకస్మాత్తుగా ఒక పులి అతని ముందు నుంచి వేగంగా పరుగులు తీస్తూ వెళుతుంది. దానిని చూసి ఆ వ్యక్తి షాకవుతాడు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో షేర్ చేశారు. వీడియోను షేర్ చేసిన ఆయన దాని క్యాప్షన్‌లో ఇలా రాశారు. ‘ఇతను అందరికన్నా అదృష్టవంతుడైన వాడా? టైగర్ అతనిని చూసి అస్సలు స్పందించలేదు..’ అని రాశారు.
కేవలం 41 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోను డిసెంబర్ 8న ఎక్స్‌లో షేర్ చేయగా, దీనిపై వ్యూవర్స్ రకరకాలుగా తమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 4 లక్షల 76 వేల మంది వీక్షించగా, 5 వేల మందికి పైగా వ్యూవర్స్ ఈ వీడియోను లైక్ చేశారు. ఒక యూజర్.. ‘సర్, ఇది ఉత్తరాఖండ్ ప్రజలకు సాధారణమైన అంశం’ అని రాశారు. మరొకరు  ‘ఆ టైగర్ ఉపవాస దీక్షలో  ఉంది’ అని రాశారు.
ఇది కూడా చదవండి: ఆ మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులెవరు? సస్పెన్స్ వీడేదెన్నడు?
 
Is he the luckiest man alive. Tiger seems least bothered. From Corbett. pic.twitter.com/ZPOwXvTmTL
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 8, 2023

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
