narrow escape
-
అంబులెన్స్‌లో భారీ పేలుడు.. తృటిలో తప్పించుకున్న గర్భిణి
ముంబై: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక గర్భిణీ, ఆమె కుటుంబం అంబులెన్స్‌లో భారీ పేలుడు ఘటన నుంచి తృటిలో తప్పించుకున్నారు. బుధవారం జరిగిన ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయినట్లు సమాచారం. అయితే.. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. అంబులెన్స్ పేలుడుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాలం ప్రకారం.. జల్గావ్లోని దాదావాడి ప్రాంతానికి సమీపంలోని జాతీయ రహదారిపై అంబులెన్స్ పేలుడు ఘటన జరిగింది. అంబులెన్స్‌లో గర్భిణీ, ఆమె కుటుంబాన్ని ఎరండోల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జలగావ్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేకుంది. అంబులెన్స్ డ్రైవర్ తన వాహనం ఇంజిన్ నుంచి పొగలు రావడం గమనించి వెంటనే దిగిపోయాడు. అప్రమత్తమైన డ్రైవర్.. అంబులెన్స్‌లో ఉన్నవారిని సైతం వెంటనే దిగాల్సిదిగా కోరాడు.Pregnant Woman Has Narrow Escape As Oxygen Cylinder In Ambulance Explodes in Jalgaon of Maharashtra. pic.twitter.com/PvQPkQZJEY— Aditya Raj Kaul (@AdityaRajKaul) November 13, 2024అదేవిధంగా వాహనం నుంచి దూరంగా ఉండమని సమీపంలోని ప్రజలను కూడా అప్రమత్తం చేశాడు. వాహనం మొత్తం మంటల్లో చిక్కుకొని.. కొన్ని నిమిషాల తర్వాత అంబులెన్స్‌లో ఉన్న ఆక్సిజన్ ట్యాంక్‌కు వ్యాపించింది. దీంతో భారీ శద్ధంతో పేలుడుకు సంభవించింది. అయితే ప్రమాదంలో డైవర్‌తో సహా.. గర్భిణీ,ఆమె కుటుంబం సురక్షింతంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు.గత నెలలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్గ్రా జిల్లాలో ఇలాంటి సంఘటనే జరిగింది. పెట్రోల్ పంపు దగ్గర పార్క్ చేసిన అంబులెన్స్‌లో మంటలు చెలరేగడంతో నిమిషాల తర్వాత ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కూడా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. -
రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయి.. ప్లాట్‌ఫాం మధ్యలో పడిన యువతి
తిరువనంతపురం: కదులుతున్న రైలును ఎక్కే ప్రయత్నం చేసిన యువతి.. అదుపుతప్పి ప్లాట్‌ఫాం, రైలు మధ్యలో పడిపోయారు. ఈ ప్రమాదం కేరళలోని కన్నూర్ రైల్వే స్టేషన్లో జరిగింది. ఆదివారం జరిగిన ఈ ప్రమదంలో 19 ఏళ్ల యువతికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. పుదుచ్చేరి-మంగళూరు వీక్లీ రైలులో ఇరిట్టికి చెందిన యువతి.. తలస్సేరి నుంచి మంగళూరుకు వెళుతోంది. అయితే.. మధ్యలో కన్నూర్ రైల్వే స్టేషన్లో రైలు కాసేపు ఆగటంతో.. సదరు యువతి స్టేషన్లో ఉన్న షాప్‌లో స్నాక్స్ కొనుగోలు చేయడానికి దిగారు. కొనుగోలు చేస్తున్న సమయంలోనే రైలు కదటం గమనించిన యువతి.. పరుగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె ఒక్కసారిగా రైలు, ప్లాట్ఫారం మధ్య పడిపోయారు. ప్రయాణికులు, రైల్వే పోలీసులు, క్యాటరింగ్ సిబ్బంది అప్రమత్తం కావడంతో వెంటనే డ్రైవర్‌కు సమాచారం అందించడంతో ఆమెను రక్షించేందుకు రైలును నిలిపివేశారు. ఆ యువతికి స్వల్ప గాయాలకు అవ్వటంతో.. చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం రైల్వే అధికారులు.. ఆమె మరోక రైలులో ఎక్కించి మంగళూరుకు పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.கேரளா, கண்ணூர் ரயில் நிலையத்தில் ஓடும் ரயிலில் ஏற முயன்றபோது தடுமாறி நடைமேடைக்கும் ரயிலுக்கும் இடையில் விழுந்த இளம் பெண். உடனடியாக ரயில் நிறுத்தப்பட்டு பத்திரமாக மீட்டனர். Platform க்கும் train க்கும் இடைவெளி அதிகமா இருந்ததால் சிறு காயங்களுடன் அந்த பெண் உயிர் தப்பினார் pic.twitter.com/Qb7bVUHOBb— admin media (@adminmedia1) November 4, 2024 -
హాయిగా నడుస్తూ వెళ్తున్న వ్యక్తికి హఠాత్తుగా పులి ఎదురైతే?
సింహం, పులి, చిరుత.. వీటి పేర్లు వినగానే మన మనసులో ఎక్కడో భయం నెలకొంటుంది. ఒకవేళ ఈ అటవీ జంతువులు ఎదురైతే ఎవరైనా సరే ఒక్క ఉదుటున పరుగులందుకుంటారు. ఈ ప్రమాదకరమైన జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ ఇంటర్నెట్లో దర్శనమిస్తుంటాయి. వీటిలో కొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోలో తొలుత ఒక వ్యక్తి రహదారి గుండా హాయిగా నడుచుకుంటూ వెళుతున్నట్లు కనిపిస్తాడు. ఇంతలో అకస్మాత్తుగా ఒక పులి అతని ముందు నుంచి వేగంగా పరుగులు తీస్తూ వెళుతుంది. దానిని చూసి ఆ వ్యక్తి షాకవుతాడు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో షేర్ చేశారు. వీడియోను షేర్ చేసిన ఆయన దాని క్యాప్షన్‌లో ఇలా రాశారు. ‘ఇతను అందరికన్నా అదృష్టవంతుడైన వాడా? టైగర్ అతనిని చూసి అస్సలు స్పందించలేదు..’ అని రాశారు. కేవలం 41 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోను డిసెంబర్ 8న ఎక్స్‌లో షేర్ చేయగా, దీనిపై వ్యూవర్స్ రకరకాలుగా తమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 4 లక్షల 76 వేల మంది వీక్షించగా, 5 వేల మందికి పైగా వ్యూవర్స్ ఈ వీడియోను లైక్ చేశారు. ఒక యూజర్.. ‘సర్, ఇది ఉత్తరాఖండ్ ప్రజలకు సాధారణమైన అంశం’ అని రాశారు. మరొకరు ‘ఆ టైగర్ ఉపవాస దీక్షలో ఉంది’ అని రాశారు. ఇది కూడా చదవండి: ఆ మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులెవరు? సస్పెన్స్ వీడేదెన్నడు? Is he the luckiest man alive. Tiger seems least bothered. From Corbett. pic.twitter.com/ZPOwXvTmTL — Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 8, 2023 -
జస్ట్ మిస్..! వందేభారత్ కింద.. చెకింగ్ అధికారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి..
అహ్మదాబాద్: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబయికి వెళ్తున్న రైలులో చెకింగ్ అధికారి కాస్తలో ప్రాణాలతో బయటపడ్డారు. ట్రైన్‌లోకి ఎక్కే ప్రయత్నంలో డోర్లు మూసుకోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. గుజరాత్ నుంచి వందేభారత్ రైలు ముంబయికి వెళుతోంది. ఈ క్రమంలో అహ్మదాబాద్ వద్ద ఆగింది. అక్కడే ఉన్న చెకింగ్ అధికారి రైలులోకి ఎక్కడం కాస్త ఆలస్యం అయింది. అంతలోనే రైలు ప్రారంభమైంది. ట్రైన్‌లోకి ఎక్కే ప్రయత్నం చేశారు చెకింగ్ అధికారి. కానీ అప్పటికే డోర్లు మూసుకున్నాయి. ఈ క్రమంలో ఆయన కిందపడ్డారు. కాస్తలో రైలు కింద పడే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు ఆయన్ను పైకి లాగారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. Video | Gates of Mumbai bound Vande Bharat closed at Ahmedabad station & a Ticket checker was left out. Desparate to get in, he attempted something that may have cost him his life. This is reported to have happened on 26th June. #Vandebharat #Mumbai #IndianRail pic.twitter.com/WvzuQDGudN — ABS (@iShekhab) June 29, 2023 ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నెటిజన్లు భారీగా స్పందించారు. ట్రైన్ ఎక్కేప్పుడు జాగ్రత్తలు సూచించారు. ఇదీ చదవండి: యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ.. -
ఈ భూమ్మీద నూకలున్నాయిరా బిడ్డా ..నీకు!
-
Electric Scooter Explodes: త్రుటిలో తప్పించుకున్న కుటుంబం
ఎలక్ట్రిక్ స్కూటర్‌కి చార్జింగ్ పెట్టిన కొద్ది నిమిషంలోనే పేలుడు సంభవించింది. దీంతో ఆ ఇంటిలోని అన్ని గృహోపకరణాలన్ని దగ్ధమయ్యాయి. ఐతే ఆ కుటుంబ సభ్యులు మాత్రం ఈ పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని మండ్యలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..కర్ణాటకలో మండ్యా జిల్లాలో ఓ కుటుంబం చార్జింగ్ కోసం అని ఇంటి లోపలే ఎలక్ట్రిక్ స్కూటర్ని పార్క్ చేశారు. వారు ప్లెగ్‌ఇన్ చేసిన కొద్దిసేపటిలోనే స్కూటర్ పేలింది. దీంతో ఇంటిలోని విలువైన వస్తువులన్ని దగ్ధమైపోయాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబసభ్యులు ఇంటిలోనే ఉన్నారు. ఐతే అందరూ స్కూటర్ దూరంగా ఉండటం వల్ల వారంతా ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ పేలుడు ధాటికి టీవీ, ఫ్రిజ్, డైనింగ్ టేబుల్, మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులన్ని ఆహుతైపోయాయి. స్కూటీకి మంటలు అంటుకున్నప్పడు సమీపంలోనే తమ చిన్నారి కూడా ఉన్నాడని, కానీ మంటలను అదుపు చేయలేకపోయామని ఇంటి యజమాని ముత్తురాజ్ చెప్పుకొచ్చారు. తాను రూట్ కంపెనీకి చెందిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆరు నెలల క్రితమే షోరూం నుంచి రూ. 85 వేలకు కొనుగోల చేసినట్లు తెలిపారు. (చదవండి: ఇండిగో విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ..దించేసినా దక్కని ప్రాణం) -
నందమూరి రామకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, బంజారాహిల్స్: ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం ఆయన తన కారును డ్రైవ్ చేసుకుంటూ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్10 మీదుగా వెళ్తుండగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. (చదవండి: తెలంగాణ కొత్త సెక్రటేరియల్ ప్రారంభోత్సవం వాయిదా) -
బైక్‌ను వెంబడించిన చిరుత; కేక్‌తో ప్రాణాలు కాపాడుకున్నారు
భోపాల్: తమను వెంబడిస్తున్న చిరుతపులిపై బర్త్‌డే కేక్‌ను విసిరి ఇద్దరు సోదరులు వారి ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఆశ్చర్యకర ఘటన మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఫిరోజ్, సబీర్ మన్సూరీ ఇద్దరు అన్నదమ్ములు. కాగా గురువారం ఫిరోజ్ తన కుమారుడు పుట్టినరోజు కావడంతో కేక్ కొనుగోలు చేసేందుకు అతని సోదరుడు సబీర్ మన్సూరితో కలిసి బైక్‌పై జిల్లా కేంద్రానికి వెళ్లాడు. కేక్ కొనుగోలు చేసి తిరిగి గ్రామానికి వస్తుండగా దారి మధ్యలో ఉన్న చెరుకుతోట వద్ద ఒక చిరుతపులి వీరి బైక్‌ను వెంబడించింది. భయంతో వారిద్దరు తమ బైక్‌ను వేగంగా పోనిచ్చినప్పటికి చిరుత పులి వేగంగా వారిని సమీపించింది. బైక్‌పై వెనుకాల కూర్చున్న సబీర్ ఏం చేయాలో తెలియక తన చేతొలో ఉన్న కేక్‌బాక్స్‌ను చిరుత మీదకు విసిరాడు. అయితే అది ఏదైనా మారణాయుధం అని భావించిన చిరుత పులి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. అప్పటివరకు ప్రాణభయంతో పరుగులు పెట్టిన వారిద్దరు బతుకుజీవుడా అంటూ గ్రామానికి చేరుకున్నారు. ఊర్లోకి వెళ్లిన తర్వాత గ్రామస్థులకు విషయం చెప్పడంతో స్థానిక అటవీ అధికారులకు సమాచారం అందించారు. అయితే ఫిరోజ్ అందించిన సమాచారం మేరకు చిరుత పులి వారి బైక్‌ను దాదాపు 500 మీటర్ల దూరం వెంబడించిందని అధికారులు తెలిపారు. తమ ప్రాణాలను రక్షించుకోవడం కోసం తమ చేతిలో ఉన్న కేక్‌బాక్స్‌ను విసిరేసి అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. -
హోరున గాలివాన: యముడు లీవ్‌లో ఉన్నాడేమో, లేదంటే!
సాక్షి, ముంబై: తౌక్టే తుపానుతో మహారాష్ట్ర, గుజరాత్, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కరోనాతో అల్లాడుతున్న ముంబై నగరంపై తౌక్టే మరింత తీవ్రంగా విరుచుకుపడుతోంది. రోడ్లన్నీ జలమయ్యాయి. వరద తాకిడికి భారీ సంఖ్యలో చెట్లు, భవనాలు కూలిపోయాయి. ఈక్రమంలోనే ముంబైలో సోమవారం వెలుగుచూసిన ఓ ఘటన భయంగొల్పేదిగా ఉంది. ఈ వీడియో దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వీడియో ప్రకారం.. వర్షం పడుతుండటంతో ఓ యువతి గొడుగు పట్టుకుని రోడ్డు వెంట వెళుతోంది. అంతలోనే మరింత గాలి వీయడం, వర్షం కురియడంతో ఆమె తన గొడుగుని ఇంకాస్త అడ్డుగా పెట్టుకుని ముందుకు కదిలింది. అయితే, ఆమెకు అతి సమీపంలో, రోడ్డు పక్కనే ఉన్న ఓ భారీ వృక్షం గాలి వాన ప్రభావంతో ఒక్కసారిగా అడ్డంగా విరిగింది. గొడుగు అడ్డు పెట్టుకుని అటువైపుగా వెళ్తున్న ఆ యువతి ప్రమాదాన్ని గ్రహించి.. క్షణ కాలంలో అక్కడ ఉంచి పరుగెత్తింది. దాంతో చెట్టు భాగాలు ఆమెకు అడుగు దూరంలో నేలకూలాయి. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘ఈరోజు యమధర్మరాజుకు సెలవు. లేదంటే ఆ యువతి ప్రాణాలు హరీ మనేవి’ అని ఒకరు... ‘క్షణకాలం ఆలస్యమైతే ఆమె పరిస్థితి ఏమయ్యేదో. ఊహించేందుకే భయంగా ఉంది’ అని మరొకరు కామెంట్లు చేశారు. అదృష్టం అంటే ఇదే మరి, అప్రమత్తంగా వ్యవహరించి అపాయం నుంచి గట్టెకింది అని మరొకరు అన్నారు. తనకు కూడా ఇటువంటి అనుభవం ఎదురైందని ఓ నెటిజన్ వీడియో షేర్ చేశారు. -
తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న యువతి
-
దిఘా సూపర్ ఫాస్ట్ రైలుకు తప్పిన ప్రమాదం
-
బస్సుకు తప్పిన పెను ప్రమాదం
-
మిరాకిల్.. చావు నోట్లోకెళ్లి బయటపడ్డాడు!
సాక్షి, రామగుండం: నిజంగా ఈ కీమెన్ మృత్యువును జయించాడు. గూడ్సు రైలు వస్తుందని ఒక రైల్వే ట్రాక్‌పై నుంచి మరో ట్రాక్‌పైకి వెళ్లడం.. అంతలోనే అటువైపు నుంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అతనిపైకి దూసుకురావడం.. క్షణాల్లో అతను రైలు ఇంజన్ కిందికి దూరిపోవడం.. అయ్యో.. నుజ్జునుజ్జయి ఉంటాడని ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారంతా ఆందోళన చెందడం.. ఇంతలోనే చావు నోట్లోకెళ్లి ప్రాణాలతో బయటపడటం.. ఇదంతా చూస్తుంటే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది కదూ.. ఔను, ఈ కీమెన్ మృత్యు కోరల్లోకెళ్లి ప్రాణ గండం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలోని కుందనపల్లి రైల్వేగేటు వద్ద చోటుచేసుకుంది. కుందనపల్లి రైల్వేగేటు వద్ద కీమెన్ కత్తుల దుర్గయ్యతో రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల్లో నిమగ్నమయ్యాడు. మూడు రైల్వే ట్రాకుల్లో ఒక ట్రాక్‌పై పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా గూడ్సు రైలు వస్తుండటంతో మరో ట్రాక్ మీదకు కార్మికులు చేరుకున్నారు. అప్పటికే అతి దగ్గరలో ఉన్న రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ క్షణాల్లో కీమెన్ దుర్గయ్యపై దూసుకొచ్చింది. అప్రమత్తమైన ఆయన ఇంజిన్ కిందకు దూరిపోయాడు. రెండు బోగీలు అతని పైనుంచి వెళ్లాయి. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు భయాందోళన చెందారు. రైలు కో పైలెట్ చాకచక్యంగా వ్యవహరించాడు. సడెన్ బ్రేక్ వేసి రైలును కొద్ది దూరంలో నిలిపివేశాడు. అప్పటికే కీమెన్ పైనుంచి రెండు బోగీలు వెళ్లడంతో బాధితుడు నుజ్జునుజ్జు అయి ఉంటాడని అందరూ భావించారు. కానీ దుర్గయ్య పట్టాల మధ్యలో ప్రాణాలు బిగపట్టుకొని పడుకుని ఉన్నాడు. ఎడమ కాలి ఎముక విరిగి ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అతడిని రైలు కింద నుంచి బయటకు లాగి హుటాహుటిన స్థానిక రైల్వే ఆస్పత్రికి తరలించారు. -
తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
భైరవపట్నం/మండవల్లి (కైకలూరు): పూరి– తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణాజిల్లా మండవల్లి మండలం భైరవపట్నం గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పూరి–తిరుపతి రైలు (17479) ఉదయం 5.47 గంటలకు కైకలూరు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అయితే మండవల్లి మండలం భైరవపట్నం గ్రామసమీపంలో రైలు పట్టా విరిగిపోయింది. దీనిని గమనించిన రైల్వే కీమెన్ ఇంజన్‌లోని డ్రైవర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో రైలును భైరవపట్నం గ్రామసమీపంలోనే నిలిపివేశారు. అనంతరం కైకలూరు నుంచి రైల్వే ఇంజనీరింగ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని విరిగిన పట్టాకు మరమ్మతులు చేపట్టారు. తర్వాత 6.30 గంటలకు రైలు బయలుదేరడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ భైరవపట్నం గ్రామం వద్ద పట్టా విరగడం గమనార్హం. కాగా, రైలు నిలిపివేయడంతో భీమవరం–విజయవాడ లైన్లో పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. -
దిగబడిన విమానం.. ప్రయాణీకులు సేఫ్
గువాహటి : ఓ జెట్ లైట్ విమానం తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. గువాహటి నుంచి జోర్హాట్కు బయలుదేరిన విమానం ల్యాండ్ అవుతుండగా ట్యాక్సీ వేలోకి దూసుకెళ్లి దిగబడిపోయింది. ఆ సమయంలో విమానంలో 90 మంది ప్రయాణీకులు ఉన్నారు. జెట్ ఎయిర్వేస్ తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరుకు చెందిన ఈ విమానం గువాహటి గుండా జోర్హాట్కు వెళ్లింది. తిరిగి అక్కడి నుంచి ఢిల్లీకి బయల్దేరాల్సి ఉండగా సరిగ్గా ల్యాండ్ అయ్యే సమయంలో ఈ ఘటన జరిగింది. విమానంలోని ఒక వీల్ కాస్త మట్టిలోకి దిగిపోవడంతో అక్కడే విమానం ఆపేసి ప్రయాణీకులను సురక్షితంగా తరలించారు. ప్రయాణీకులు అంతా సురక్షితమే అంటూ జెట్ ఎయిర్వేస్ ట్వీట్ చేయగా దీనికి స్పందించిన కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ ఈ వ్యవహారాన్ని పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా పరిశీలించాలని కోరారు. ఇందుకు స్పందించిన ఆయన ఈ ఘటనను జాగ్రత్తగా దర్యాప్తు చేయిస్తామని హామీ ఇచ్చారు. -
‘స్వర్ణ శతాబ్దిఎక్స్‌ప్రెస్’కు తప్పిన ప్రమాదం
బులంద్‌షహర్(ఉత్తరప్రదేశ్): స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం ఢిల్లీ- హౌరా మార్గంలో లక్నో వైపు వెళ్తుండగా 5, 6 కోచ్‌ల లింక్ తెగిపోయింది. దీంతో రైలు ఒక్కసారిగా పెద్ద కుదుపునకు లోనయింది. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ అత్యవసర బ్రేక్‌లను ఉపయోగించి రైలు వేగాన్ని వెంటనే తగ్గించేశారు. ఈ ఘటన కారణంగా ప్రయాణికులెవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేరు. రైలు నిలిచిపోవటంతో ఈ మార్గంలో వెళ్లే కుల్కామెయిల్ తదితర రైళ్లను ఖుర్జా జంక్షన్ వద్దనే నిలిపివేశారు. రైల్వే సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. సుమారు గంట అనంతరం రైళ్లు తిరిగి యథావిధిగా నడిచాయి. -
అగ్నికి ఆహుతైన కెమికల్ ఫ్యాక్టరీ
-
తృటిలో తప్పిన రైలు ప్రమాదం
-
తృటిలో తప్పిన ముప్పు...
కుమర్హట్టిః వందలకొద్దీ స్కూలు విద్యార్థులు, ఉద్యోగులతో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల భవనం కుప్ప కూలింది. అయితే దాంట్లోనివారంతా ప్రమాదంనుంచీ తృటిలో తప్పించుకోగలిగినట్లు అధికారులు వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ సర్విత్కరీ శిక్షా నికేతన్ పాఠశాల మొత్తం 350 మంది విద్యార్థులు, సిబ్బందితో కొనసాగుతోంది. బీటలు వారి ఉన్న స్కూలు భవనం నుంచీ విద్యార్థులను ఖాళీ చేయించేందుకు ఎప్పట్నుంచో నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ప్రమాదం జరిగేందుకు కొద్ది నిమిషాల క్రితమే భవనాన్ని ఖాళీ చేయించారు. దీంతో భారీ ముప్పు తృటిలో తప్పించుకోగలిగారని డిప్యూటీ కమిషనర్ రాకేష్ కన్వర్ తెలిపారు. అప్పటికే బీటలు వారి ఉన్న స్కూలు భవనం ఊగుతున్నట్లుగా అనిపించిన సిబ్బంది.. వెంటనే అక్కడినుంచీ విద్యార్థులను బయటకు పంపించేశారు. దీంతో స్కూల్లోని మొత్తం 342 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడినట్లు స్కూలు అధికారులు తెలిపారు. భవనం కదులుతున్నట్లుగా అనిపించిన మాలా మేడమ్.. వెంటనే స్పందించి పిల్లలందరినీ క్లాసులనుంచీ బయటకు పంపించేశారని ఓ విద్యార్థి పోలీసులకు వివరించాడు. అయితే పాఠశాల భవనం కూలడానికి గల కారణాలను తెలుసుకుంటామని, ఎటువంటి నిర్వహణా లోపాలు లేనట్లు నిర్ధారించుకున్న తర్వాతే.. స్కూలు తిరిగి కొనసాగించేందుకు అనుమతి ఇస్తామని కన్వర్ తెలిపారు. -
విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
శ్రీకాకుళం: స్కూలు విద్యార్థులతో వెళ్తున్న పడవకు త్రుటిలో ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం రంగరాయపురం వద్ద శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. సంతకవిటి గ్రామానికి చెందిన 15 మంది విద్యార్థులు నాగావళి ఆవలి ఒడ్డున ఉన్న పాఠశాలలో చదువుకుంటున్నారు. ఆ క్రమంలో శనివారం ఉదయం వారు బయలుదేరిన పడవకు నారాయణపురం అడ్డుకట్ట సమీపంలో దట్టంగా ఉన్న గుర్రపుడెక్క ఆకు అడ్డుపడింది. పడవ ముందుకు సాగలేదు. దీంతో పడవ మునిగిపోయే ప్రమాదంలో పడింది. ఈ దశలో సరంగులు అప్రమత్తమై పడవను వెనక్కి తీసుకువచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. -
మంత్రి కాన్వాయ్కి తప్పిన ప్రమాదం
కరీంనగర్: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్కి బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని ఓ వాహన డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో వెనకున్న టీఆర్ఎస్ నాయకుల వాహనాలు ఒకదానివెంట మరొకటి వరసగా ఢీకొన్నాయి. దీంతో సదరు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి ఈటల రాజేందర్ బుధవారం మెట్పల్లి వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి వెళ్తున్నప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. -
స్కూల్ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం
మణుగూరు :ఖమ్మం జిల్లా మణుగూరు సమీపంలో మంగళవారం స్కూలు బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. విప్పల సింగారం నుంచి జీఎం ఆఫీసు రోడ్డులో వస్తున్న హోలీ ఫ్యామిలీ స్కూల్ బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోయి... అదుపుతప్పి బస్సు కాల్వలోకి దూసుకెళ్ల్లింది. అందులోని ఐదుగురు విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ సంఘటన అనంతరం బస్సు డ్రైవర్ పరారయ్యాడు. అయితే పాఠశాల యాజమాన్యం మాత్రం ఈ వ్యవహారంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తృటిలో తప్పిన పెను ప్రమాదం
-
మమతా బెనర్జీకి తప్పిన ప్రమాదం
-
విజయసాయిరెడ్డిని పరామర్శించిన జగన్
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డిని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సతీమణి వైఎస్ భారతి సమేతంగా బుధవారం మధ్యాహ్నం వెళ్లి పరామర్శించారు. జగన్ దంపతులు కొద్దిసేపు సాయిరెడ్డి వద్ద ఉండి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులతో మాట్లాడారు. సాయిరెడ్డి త్వరగా కోలుకోవాలని వారిద్దరూ ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడిన మరో నేత సాగి దుర్గాప్రసాదరాజు ఆరోగ్యం పూర్తిగా కుదుటపడటంతో ఆయన్ను బుధవారం ఉదయమే వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.