‘స్వర్ణ శతాబ్దిఎక్స్‌ప్రెస్‌’కు తప్పిన ప్రమాదం | narrow escape train accident at Khurha Station | Sakshi
Sakshi News home page

‘స్వర్ణ శతాబ్దిఎక్స్‌ప్రెస్‌’కు తప్పిన ప్రమాదం

Aug 2 2017 7:30 PM | Updated on Sep 11 2017 11:06 PM

స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది.

బులంద్‌షహర్‌(ఉత్తరప్రదేశ్‌): స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం ఢిల్లీ- హౌరా మార్గంలో లక్నో వైపు వెళ్తుండగా 5, 6 కోచ్‌ల లింక్‌ తెగిపోయింది. దీంతో రైలు ఒక్కసారిగా పెద్ద కుదుపునకు లోనయింది. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్‌ అత్యవసర బ్రేక్‌లను ఉపయోగించి  రైలు వేగాన్ని వెంటనే తగ్గించేశారు.

ఈ ఘటన కారణంగా ప్రయాణికులెవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేరు. రైలు నిలిచిపోవటంతో ఈ మార్గంలో వెళ్లే కుల్కామెయిల్‌ తదితర రైళ్లను ఖుర్జా జంక‌్షన్‌ వద్దనే నిలిపివేశారు. రైల్వే సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. సుమారు గంట అనంతరం రైళ్లు తిరిగి యథావిధిగా నడిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement