స్కూల్ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం | School bus narrow escape from accident in khammam district | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం

Aug 2 2016 11:29 AM | Updated on Apr 3 2019 7:53 PM

ఖమ్మం జిల్లా మణుగూరు సమీపంలో స్కూలు బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది.

మణుగూరు :ఖమ్మం జిల్లా మణుగూరు సమీపంలో మంగళవారం స్కూలు బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. విప్పల సింగారం నుంచి జీఎం ఆఫీసు రోడ్డులో వస్తున్న హోలీ ఫ్యామిలీ స్కూల్ బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోయి...  అదుపుతప్పి బస్సు కాల్వలోకి దూసుకెళ్ల్లింది. అందులోని ఐదుగురు విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.

ఈ సంఘటన అనంతరం బస్సు డ్రైవర్ పరారయ్యాడు. అయితే పాఠశాల యాజమాన్యం మాత్రం ఈ వ్యవహారంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై విద్యార్థుల  తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement