Man who is in live-in relationship, died in suspicious condition - Sakshi
Sakshi News home page

ఛాతీలో చాకు దిగబడి లివ్‌ ఇన్‌ పార్ట్‌నర్‌ మృతి.. వాటర్‌ మిలన్‌ కట్‌ చేస్తుండగా..

Jun 24 2023 7:56 AM | Updated on Jun 24 2023 8:52 AM

man lives in live in relationship died in suspicious - Sakshi

సందీప్‌, పూజ నాలుగేళ్లుగా లివ్‌ ఇన్‌లో ఉన్నారు. సందీప్‌ హరియాణాలోని హిసార్‌ ప్రాంతానికి చెందినవాడు. పూజ ఢిల్లీకి చెందిన యువతి. పూజ సిఎస్‌ఎస్‌బీలో సిపాయిగా విధులు నిర్వహిస్తోంది. ఆమె చికిత్స కోసం సందప్‌ను ఆసుపత్రికి తీసుకు వచ్చింది. సందీప్‌ ఛాతీలో చాకుతో అయిన తీవ్ర గాయం ఉంది. చికిత్స పొందుతూ సందీప్‌ మృతి చెందాడు. 

హరియాణాలోని గురుగ్రామ్‌లో ఛాతీలో చాకు దిగబడిన నేపధ్యంలో చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకు వచ్చిన ఒక యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆ యువకుడిని అతని లివ్‌ ఇన్‌ పార్ట్‌నర్‌ ఆసుపత్రికి తీసుకువచ్చింది. అనుమానాస్పద స్థితిలో ఆ యువకుడు మృతిచెందడంతో పోలీసులు దీనిని హత్య కేసుగా భావిస్తూ, అతని లివ్‌ఇన్‌ పార్ట్‌నర్‌ను అరెస్టు చేసి, పలు విధాలుగా ప్రశ్నిస్తున్నారు. 

డిఎల్‌ఎప్‌ పేజ్‌-3 పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉంటున్న 35 ఏళ్ల సందీప్‌ను చికిత్స కోసం నారాయణ సుపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. 

ఈ సంద్భంగా సందీప్‌ లివ్‌ ఇన్‌ పార్ట్‌నర్‌ పూజాశర్మ(25) పోలీసులతో మాట్లాడుతూ వాటర్‌ మిలన్‌ కట్‌ చేస్తుండగా సందీప్‌ ఛాతీలో చాకు దిగబడిందని తెలిపింది. దీంతో అతను తీవ్రంగా గయాపడ్డాడని, తాను వెంటనే ఆసుపత్రికి తీసుకు వచ్చానని, అయినా ఫలితం లేకపోయిందని తెలిపింది.

తాను, సందీప్‌ గత నాలుగేళ్లుగా లివ్‌ ఇన్‌లో ఉంటున్నామని, సందీప్‌ వాహనాల కొనుగోలు- అమ్మకాల వ్యాపారం చేస్తుంటాడని తెలిపింది. కాగా సమాచారం తెలిసిన వెంటనే సందీప్‌ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ ఉదంతం గురించి ఎసీపీ డీఎల్‌ఎఫ్‌ వికాస్‌ కౌశిక్‌ మాట్లాడుతూ సందీప్‌ వాటర్‌ మిలన్‌ కట్‌ చేస్తుండగా, చాకు గుచ్చుకుని చనిపోయాడని పూజ చెబుతున్నదని అన్నారు. అయితే తాము పూజ చెబుతున్న దానిలో నిజా నిజాలు తేల్చేందుకు ఆమెను ప్రశ్నిస్తున్నామన్నారు.

ఇది కూడా చదవండి: మహిళపై లైంగిక దాడి.. అడ్డుకుందని రైలులో నుంచి తోసివేత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement