ముంబైలో దారుణం.. రోడ్డుపై ప్రియురాలి హత్య | Man Killed His Lover In Mumbai Over Suspicious, More Details Inside | Sakshi
Sakshi News home page

ముంబైలో దారుణం.. ప్రియురాలిని రెంచీతో కొట్టి చంపిన మాజీ ప్రియుడు

Published Tue, Jun 18 2024 9:50 PM | Last Updated on Wed, Jun 19 2024 11:03 AM

Man Killed  His Lover In Mumbai

ముంబై: దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబయిలో దారుణం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ వ్యక్తి తన మాజీ ప్రియురాలిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పెద్ద ఇనుప రెంచీతో దారుణంగా హత్య చేశాడు. అక్కడున్న వారు ఈ దారుణాన్ని చూస్తూ నిల్చుండిపోయారు. ఆపేందుకు ఒక్కరు కూడా ప్రయత్నించలేదు. 

ఈ ఘోరానికి సంబంధించిన  దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ముంబయికి చెందిన రోహిత్‌ యాదవ్‌ ఓ యువతితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ఏవో కొన్ని కారణాల వల్ల వారి మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. దీంతో యువతి రోహిత్‌ను దూరం పెట్టింది. ఆమె మరొకరితో  సన్నిహితంగా ఉంటుందేమోనని రోహిత్‌ అనుమానం పెంచుకున్నాడు.

అదే యువతి పాలిట శాపంగా మారింది. మంగళవారం(జూన్‌18) ఉదయం పనికి వెళుతున్న ఆమెను రోహిత్‌ వెంబడించాడు.  ఇనుప రెంచీతో ఆమెపై దాడికి దిగాడు. తలపై బలంగా కొట్టడంతో ఆమె నేలకొరిగింది. అయినా సరే యువతిని విడిచిపెట్టకుండా పలుమార్లు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement