కారుకు కట్టేసి.. రెండున్నర కి.మీ.లు లాక్కెళ్లి | Man dies after his friend dragged him for 2. 5 km by car in UP Hardoi | Sakshi
Sakshi News home page

కారుకు కట్టేసి.. రెండున్నర కి.మీ.లు లాక్కెళ్లి

Sep 30 2026 5:03 AM | Updated on Sep 30 2026 5:03 AM

Man dies after his friend dragged him for 2. 5 km by car in UP Hardoi

కారు ఈడ్చుకెళ్లడంతో వ్యక్తి మృతి

హర్దోలీ: ఇద్దరూ స్నేహితులు. సరదాగా కలిశారు. ఒకరి మేనమామ ఇంటికి యథాలాపంగా వెళ్లొచ్చారు. పూటుగా తాగారు. తిరుగుప్రయాణంలో చిన్న వాగ్వాదం కాస్తా ఇద్దరి మధ్య విబేధాలను పెద్దదిచేసింది. దీంతో స్నేహితుడిని తోటి వ్యక్తి తన కారు వెనకాల కట్టేసి రెండున్నర కిలోమీటర్ల దూరం లాక్కెళ్లడంతో గాయాలతో అతను చనిపోయిన ఘటన యూపీలో జరిగింది. సెప్టెంబర్ 19న బబ్లూ రాథోడ్‌ను విమలేశ్‌ రాథోడ్‌ అనే వ్యక్తి షాహబాద్‌ తీసుకెళ్లాడు. 

తర్వాత పిహానీ పట్టణంలోని బబ్లూ మేనమామ ఇంటికి వెళ్లి అక్కడి నుంచి బయల్దేరారు. మార్గమధ్యంలో ఇద్దరికీ గొడవ జరిగింది. అప్పటికే ఇద్దరూ పూటుగా తాగి ఉన్నారు. గొడవ వేళ బబ్లూ చేతులను కారుకు కట్టేసి విమలేశ్‌ రెండున్నర కిలోమీటర్లు పోనిచ్చాడు. దీంతో రక్తసిక్తమై బబ్లూ చనిపోయాడు. దీంతో బబ్లూ కుటుంబం డాక్‌ బంగ్లా వద్ద రాస్తారోకో చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌చేసింది. పోలీసులు కేసు నమోదుచేసి, విమలేశ్‌ను అరెస్ట్‌చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి పంపించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement