Mahakumbh: అఖాడాల అమృతస్నానం.. హెలికాప్టర్‌ నుంచి పూల వర్షం.. వార్‌ రూమ్‌లో సీఎం యోగి | Mahakumbh Prayagraj 2025 Live Updates Devotees Sangam Ghats | Sakshi
Sakshi News home page

Mahakumbh: అఖాడాల అమృతస్నానం.. హెలికాప్టర్‌ నుంచి పూల వర్షం.. వార్‌ రూమ్‌లో సీఎం యోగి

Feb 3 2025 9:19 AM | Updated on Feb 3 2025 10:11 AM

Mahakumbh Prayagraj 2025 Live Updates Devotees Sangam Ghats

యూపీలో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈరోజు(సోమవారం) వసంత పంచమి సందర్భంగా త్రివేణి సంగమంలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు సాయంత్రం నాటికి ఐదు కోట్లకు పైగా భక్తులు స్నానాలు ఆచరిస్తారని కుంభమేళా నిర్వాహకులు అంచనా వేశారు. జనసమూహాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. వసంత పంచమి అమృత స్నానాల సందర్బంగా భక్తులపై హెలికాప్టర్‌ నుంచి పూల వర్షం కురిపించారు. మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ‘వార్‌ రూమ్‌’లో కూర్చుని, కుంభమేళా పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తున్నారు.
 

ప్రయాగ్‌రాజ్‌లో వసంత పంచమి సందర్భంగా అమృత స్నానానికి సిద్ధమైన సాధువులు, భక్తుల మధ్య సంగమ్‌ ఘాట్ వద్ద శంఖం పూరిస్తున్న ఒక మహిళా భక్తురాలు.

ప్రయాగ్‌రాజ్‌లో వసంత పంచమి సందర్భంగా 'అమృత స్నానం' కోసం త్రివేణి సంగమం వైపు వెళుతున్న విదేశీ భక్తులు 'హనుమాన్ చాలీసా' పఠిస్తూ కనిపించారు.

స్వామి కైలాసానంద గిరి మాట్లాడుతూ ‘13 అఖాడాలు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేస్తున్నారు. మేము గంగా మాతను, శివుడిని పూజించాం. నాగ సాధువులంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇది మా మూడవ 'అమృత స్నానం', నేను ఉత్తరప్రదేశ్ నుండి వచ్చాను. 13 అఖాడాలకు అవసరమైన ఏర్పాట్లు చేసినందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అభినందనలు’ అని అన్నారు.

ప్రయాగ్‌రాజ్‌లోని ఒక నాగ సాధువు  మాట్లాడుతూ ‘గత రెండు అమృత స్నానాల కంటే ఈరోజు ఏర్పాట్లు మెరుగ్గా ఉన్నాయి. ఈరోజు స్నానం  మాకెంతో ముఖ్యమైనది’ అని అన్నారు.

ప్రయాగ్‌రాజ్‌లోని ఒక సాధువు మీడియాతో మాట్లాడుతూ ‘ఈరోజు అమృత స్నానం  ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. అఖాడాలు, సాధువులు పవిత్ర స్నానాలు ఆచరించారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయి’ అని అన్నారు.

ప్రయాగ్‌రాజ్‌లో పవిత్ర స్నానం చేసిన తర్వాత ఒక విదేశీ భక్తుడు మాట్లాడుతూ ‘ఇది మాటల్లో చెప్పలేని మధుర అనుభవం. నేను చాలా ధన్యుడినయ్యానని భావిస్తున్నాను’ అని అన్నారు.

ఆచార్య లక్ష్మీనారాయణ్ త్రిపాఠి  మాట్లాడుతూ ‘ఈ పవిత్రమైన రోజున  అందరం చాలా సంతోషంగా ఉన్నాం. అఖాడాలు ఎల్లప్పుడూ ఐక్యంగానే ఉంటారు’ అని అన్నారు.

జునా అఖారా స్నానం పూర్తయింది. మొదట మహానిర్వాణి, తరువాత శ్రీ నిరంజని, అనంతరం జునా అఖారా స్నానం చేశారు. జూనా అఖారాకు చెందిన నాగ సాధువులు వసంత పంచమి సందర్భంగా అమృత స్నానం చేశారు.

 

ఇది కూడా చదవండి: Mahakumbh: వసంత పంచమి అమృత స్నానాలు ప్రారంభం
 

 

Advertisement
 
Advertisement
Advertisement