మోదీ విజయం జాతీయ బాధ్యత: నడ్డా | Lok sabha elections 2024: Helping Modi return for 3rd term your national responsibility | Sakshi
Sakshi News home page

మోదీ విజయం జాతీయ బాధ్యత: నడ్డా

Apr 5 2024 6:28 AM | Updated on Apr 5 2024 6:28 AM

Lok sabha elections 2024: Helping Modi return for 3rd term your national responsibility - Sakshi

డెహ్రాడూన్‌:  నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా నెగ్గడానికి సహకరించడం ప్రజల జాతీయ బాధ్యత అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలంటే మోదీని మూడోసారి గెలిపించుకోవాలని సూచించారు. నడ్గా గురువారం ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు.

ఉత్తరాఖండ్‌లోని మొత్తం ఐదు లోక్‌సభ స్థానాలకు బీజేపీకి కట్టబెట్టాలని కోరారు. మోదీని మళ్లీ గెలిపిస్తే దేశాన్ని మరింత అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఓటు బ్యాంకు రాజకీయాలు, కుల రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి రాజకీయాలకు శ్రీకారం చుట్టిన ఘనత నరేంద్ర మోదీదే అని నడ్డా ప్రశంసించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement