పంజాబ్, అస్సాం జిల్లాల పోలీసు చీఫ్‌ల బదిలీ | Sakshi
Sakshi News home page

పంజాబ్, అస్సాం జిల్లాల పోలీసు చీఫ్‌ల బదిలీ

Published Fri, Mar 22 2024 6:04 AM

Lok sabha elections 2024: EC transfers police chiefs who are kin of politicians in Punjab, Assam - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్‌(ఈసీ)మరికొందరు అధికారులకు స్థానచలనం కల్పించింది. తాజాగా అస్సాం, పంజాబ్‌ల్లోని జిల్లా పోలీసు చీఫ్‌లను బదిలీ చేసింది.

పంజాబ్, ఒడిశా, గుజరాత్, పశ్చిమబెంగాల్‌లలో పనిచేసే అయిదుగురు నాన్‌ కేడర్‌ జిల్లా మేజిస్ట్రేట్లు(డీఎంలు), 8 మంది పోలీస్‌ సూపరింటెండెంట్ల(ఎస్‌పీలు)ను సైతం బదిలీ చేసింది. జిల్లా స్థాయిలో ప్రధానమైన పోస్టుల్లో ఐఏఎస్, ఐపీఎస్‌లు కాని నాన్‌–క్యాడర్‌ అధికారులను నియమించడంపై ఈసీ కఠినమైన వైఖరిని తీసుకుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement