
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భారత్‌ను నిందించాలని ప్రయత్నించిన పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటు ఎదురయ్యింది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో సింధూజలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పలు వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఆరోపణలకు భారత దౌత్యవేత్త పేటల్ గహ్లోత్ గట్టిగా బదులిచ్చారు. అవాస్తవిక నాటకాలతో వాస్తవాలను ఎంతమాత్రం మార్చలేరంటూ ఆమె పాక్ తీరును కడిగిపారేశారు.
2015లో ఐఎఫ్‌ఎస్‌లో చేరి..
పేటల్ గహ్లోత్ మహారాష్ట్రలోని రాజ్‌పుత్ కుటుంబంలో పుట్టారు. ముంబయిలోని సెయింట్ జేవియర్ కళాశాల నుంచి పొలిటికల్ సైన్స్‌లో పట్టా అందుకున్నారు. అనంతరం ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీ ఫర్ విమెన్‌లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. 2015లో ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ (ఐఎఫ్‌ఎస్)లో చేరి దౌత్యవేత్తగా చేరారు. గత పదేళ్లలో ఆమె వివిధ హోదాల్లో విధులు నెరవేర్చారు. యూరోపియన్ వెస్ట్ డివిజన్‌లో అండర్ సెక్రటరీగా పనిచేశారు.
The feeling of confusion, of being torn and of wanting everything and just one thing at the same time, encapsulated in this song from 12 years ago.
A cover of ‘Kabira’ from Yeh Jawaani Hai Deewani pic.twitter.com/ASs7usWki2— Petal Gahlot (@petal_gahlot) May 5, 2025
ఐరాసాలోని భారత మిషన్‌లో తొలి సెక్రటరీగా..
పారిస్, శాన్‌ఫ్రాన్సిస్కోల్లోని భారత దౌత్య కార్యాలయాల్లో విధులు నిర్వహించారు.తరువాతి కాలంలో ఐక్యరాజ్యసమితిలోని భారత మిషన్‌లో తొలి సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రపంచ వేదికలపై భారత్ తరఫున మాట్లాడుతూ, సమర్థురాలైన ప్రతినిధిగా పేరు తెచ్చుకున్నారు. గతంలోనూ ఆమె పాకిస్తాన్ ఆరోపణలను ఐరాసలో బలంగా తిప్పికొట్టారు. ఇప్పుడు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలను తిప్పికొట్టడంతో ఆమె పేరు మరోసారి వార్తల్లో కనిపిస్తోంది. వృత్తి పరంగా దౌత్య వ్యవహారాల్లో మునిగితేలే పేటల్ గహ్లోత్‌కు సంగీతమంటే ఎంతో ఆసక్తి. గిటార్ వాయిస్తూ పాటలు పాడుతుంటారు. వాటిని సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంటారు.